YouTuberకు రూ.4.83 కోట్ల కట్నాలు చదివించిన సబ్ స్క్రైబర్స్

సహజంగా తెలిసిన వ్యక్తయినా.. ఫ్రెండ్స్ యూట్యూబ్ పెడితే వారిని ఎంకరేజ్ చేయడానికి సబ్ స్క్రైబ్ చేస్తాం. లైకులు, కామెంట్లు, షేరింగ్ చేస్తాం.

Update: 2022-12-18 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సహజంగా తెలిసిన వ్యక్తయినా.. ఫ్రెండ్స్ యూట్యూబ్ పెడితే వారిని ఎంకరేజ్ చేయడానికి సబ్ స్క్రైబ్ చేస్తాం. లైకులు, కామెంట్లు, షేరింగ్ చేస్తాం. కానీ తెలియని ఓ వ్యక్తి యూట్యూబ్ పెట్టి తన పెళ్లికి కట్నాలు వేయాలని కోరితే కోట్ల రూపాయలను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు సబ్ స్క్రైబర్స్. తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఈ వినూత్న కానుకలకు శ్రీకారం చుట్టాడు.

సురేశ్ అలియాస్ శ్రీ అనే యువకుడు 2021 మార్చి 11న క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్ (Creative Thinks Adventure) అనే యూట్యూబ్ చానల్‌కు ప్రారంభించాడు. దీని ద్వారా చిన్న చిన్న స్టోరీలు, గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు, జోక్స్ తరతర కథనాలతో షార్ట్ ఫిల్మ్‌లు చూస్తూ తన క్రియోటివిటీని నిరూపించుకుంటున్నాడు. ఈ చానల్‌కు ఇప్పటి వరకు లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఇటీవల సురేశ్ మౌనిక (అన్విక) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి వీడియోనూ తన యూట్యూబ్‌లో పెట్టి సబ్ స్క్రైబర్స్ తన పెళ్లికి కట్నాలు చదివించాలని డిస్క్రిప్షన్‌లో పెట్టాడు. అయితే అతడి వినూత్న ఆలోచన నచ్చిన సబ్ స్క్రైబర్స్.. కట్నాలు పంపించడం మొదలు పెట్టారు. ఇలా ఇప్పటి వరకు 26, 189 మంది రూ.4,83, 23, 654 కట్నాలు పంపించారు. అయితే కానుకలు పంపించేవారు ఎంత పంపుతున్నారు, ఏం ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ రూపంలోనూ పెట్టాలని శ్రీ కోరాడు. వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.9 మిలియన్ల వ్యూస్ వచ్చారు. కొసమెరుపు ఏంటంటే.. శ్రీ తన అత్తగారి ఇంటి నుంచి రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకోవడం. నిజంగా చానల్ పేరుకు తగ్గట్టుగానే శ్రీ క్రియేటివ్‌గా ఆలోచించి ఔరా అనిపించాడు.

Tags:    

Similar News