Memory Power : చదివింది గుర్తుండట్లేదా..? డైలీ అరగంట ఈ పని చేయండి!

Memory Power : చదివింది గుర్తుండట్లేదా..? డైలీ అరగంట ఈ పని చేయండి!

Update: 2024-12-16 07:43 GMT

దిశ, ఫీచర్స్ : చదివింది గుర్తుండాలన్నా, రోజువారీ పనులు సక్రమంగా చేసుకోవాలన్నా జ్ఞాపక శక్తి బాగా ఉండాలి. అయితే కొన్నిసార్లు పోషకాహార లోపాలో, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి బద్ధకం పెరగడంవల్లో పిల్లల్లో, పెద్దల్లో కూడా కాస్త మతిమరుపు వచ్చే అవకాశం లేకపోలేదు. మరికొందరిలో వయస్సు రీత్యా తగ్గే చాన్స్ ఉంటుంది. కారణాలేమైనా మెమోరీ పవర్ క్షీణించకుండా ఉండటానికి ఏం చేయాలనే అంశంపై యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. ఆ వివరాలేంటో చూద్దాం.

రోజూ 30 నిమిషాల వ్యాయామాలు లేదా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటంతోపాటు రాత్రిళ్లు కనీసం 6 గంటల పాటు క్వాలిటీ స్లీప్ వల్ల జ్ఞాపక శక్తి మెరుగు పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఆలోచనా శక్తి మెరుగవుతుందని, రోజంతా చురుగ్గా ఉండటంలో వ్యాయామం సహాయపడుతుందని పేర్కొన్నారు. స్టడీలో భాగంగా రీసెర్చర్స్ 50 నుంచి 80 ఏండ్ల మధ్య వయస్సుగల 76 మందిని 8 రోజులపాటు అబ్జర్వ్ చేశారు. వీరిలో రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారు, చేయని వారిని విశ్లేషించగా మొదటి రకం వ్యక్తుల్లో మెమోరీ పవర్ మెరుగు పడింది. అలాగే వ్యాయామం వల్ల జ్ఞాపక శక్తి ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుసుకునేందుకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించగా.. డైలీ అరగంట ఫిజికల్ యాక్టివిటీస్ కలిగిన వారే మరసటిరోజు మిగతా వారికంటే 2 నుంచి 5 శాతం అధికంగా మెమోరీ పవర్ ప్రదర్శిస్తున్నట్లు తేలింది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News