Self-improvement : సరైన వ్యూహం.. స్వయం ఎదుగుదలకు మార్గం

Self-improvement : సరైన వ్యూహం.. స్వయం ఎదుగుదలకు మార్గం

Update: 2024-12-16 07:29 GMT

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సరైన మార్గమేదో తేల్చులోలేక డైలమాలో మునిగిపోతుంటారు. అయితే అనేక విషయాల్లో మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటే.. స్వీయ ఎదుగుదల వ్యూహాలు (Self-improvement strategies) అనుసరిస్తే అలాంటి ఇబ్బందులేవీ ఉండవంటున్నారు మానసిక నిపుణులు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్

శారీరక ఆరోగ్యం, హెల్తీ మైండ్ మధ్య బలమైన సంబంధం ఉంది. ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించడం వెనుక సదరు వ్యక్తి మైండ్ అండ్ బాడీ మధ్య సరైన కనెక్షన్ కొనసాగాల్సిన అవసరం ఉందని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. అలా ఉండాలంటే ప్రతికూల ప్రభావాలు కలిగిన జీవన శైలిని మార్చుకోవాలి. కొన్ని సార్లు చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేయడంవల్ల కూడా మానసిక, శారీరక ఆరోగ్యాలకు మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. చేయాల్సిందల్లా అవేమిటో గుర్తించడమే. ముఖ్యంగా ధూమపానం మధ్యపానం వంటివి మానేయడం, వర్కవుట్ నియమావళిని రూపొందించుకోవడం, అతి ఆలోచనలు వదులుకోవడం, హెల్తీ ఫుడ్ తినడం, రెగ్యులర్ బాడీ చెకప్స్ చేయించుకోడం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.

క్వాలిటీ స్లీప్ అండ్ షెడ్యూల్ 

ఉరుకుల పరుగుల జీవితంలో క్వాలిటీ స్లీప్ షెడ్యూల్‌ను మేనేజ్ చేయడం కష్టంగా మారుతోంది. ఇది తర్వాత తీవ్రమైన పరిణామాలను దారితీస్తుంది. జ్ఞాపశక్తిపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. ఏకాగ్రతను, చురుకుదనాన్ని కోల్పోతాం. ఫలితంగా వర్క్‌లో క్వాలిటీ తగ్గుతుంది. సరైన స్లీప్ షెడ్యూల్‌ను దీర్ఘకాలంపాటు మెయింటెన్ చేయకపోతే మానసిక రుగ్మతలు వస్తాయి. అయితే వినోదం లేదా కొంత ఏకాంతాన్ని పొందడం కోసం అప్పుడప్పుడూ నిద్రను ఆలస్యం చేయడం కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ దీర్ఘకాలం కొనసాగితే మంచి కంటే ఎక్కువగా హాని మాత్రమే చేస్తుంది. కాబట్టి‌ స్లీప్ హైజీన్ అండర్ రెగ్యులర్ స్లీప్ సైకిల్‌ను మెయింటెన్ చేయడం చాలా ముఖ్యం.

స్ట్రెస్ అండ్ రిలాక్సేషన్ 

చాలా మంది రిలాక్స్ అవడానికి ఏకైక మార్గం నిద్ర మాత్రమే అనుకుంటారు. దీంతోపాటు రోజువారీ షెడ్యూల్‌లో చేర్చగలిగే అనేక కామన్ మెథడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా రిలాక్స్ అవడం స్ట్రెస్‌ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ బ్రీతింగ్‌ను అబ్జర్వ్ చేయడం లేదా యోగా స్ట్రెచింగ్ వంటివి జీవితంలో యాక్టివ్ నెస్‌కు, సంతోషానికి, మైండ్ ఫుల్‌నెస్‌కు దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటితోపాటు రెగ్యులర్ వ్యాయామాలు కూడా స్వీయ అభివృద్ధి వ్యూహాలుగా నిపుణులు పరిగణిస్తారు. డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వంటి మెంటల్ హెల్త్ టెక్నిక్స్ రోజుకు 5 నుంచి 20 నిమిషాలు పాటిస్తే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

 గుడ్ కనెక్షన్స్‌

సెల్ఫ్ ప్రయారిటీ, స్వీయ అభివృద్ధి స్ట్రక్చర్‌ను కలిగి ఉండటం స్థిరత్వానికి, మానసిక దృఢత్వానికి దోహదం చేస్తాయి. ఒత్తిడి భావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే మిమ్మల్ని ఉత్సాహ పరిచే యాక్టివిటీస్ ఏవో గుర్తించండి. ఇష్టమైన పని లేదా ఎక్సర్‌సైజ్, ఇతర కార్యకలాపాలు ఉండేలా చూసుకోండి. అలాగే మంచి సంబంధాలు కూడా స్వీయ ఎదుగుదల వ్యూహాల్లో భాగంగా ఉంటాయి. లైఫ్ క్వాలిటీస్‌ను పెంచడమే కాకుండా మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతోపాటు స్వీయ సంరక్షణ, స్వయం ఎదుగుదల, సంతోష కరమైన జీవితానికి ముఖ్యమైన వ్యూహాల్లో ప్రతి కూల ప్రభావాలకు దూరంగా ఉండటం లేదా వాటిని నివారించడం ఒకటి. అందుకోసం టాక్సిక్ రిలేషన్‌షిప్స్, టాక్సిక్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News