Reading: పిల్లలు నైట్ ఈ టైమ్ వరకు చదువుతున్నారా.. లాభాలా-నష్టాలో తెలుసుకోండి..?

స్కూల్, కాలేజీ లైఫ్‌లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనగానే కంగారు పడుతూ.. పగలు రాత్రి తేడా లేకుండా తెగ చదివేస్తుంటారు.

Update: 2024-12-16 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్(School), కాలేజీ(College) లైఫ్‌లో స్టూడెంట్స్(Students) ఎగ్జామ్స్ అనగానే కంగారు పడుతూ.. పగలు రాత్రి తేడా లేకుండా తెగ చదివేస్తుంటారు. అయితే తల్లిదండ్రులు పిల్లలకు స్టడీ విషయాల్లో చెప్పే ఓ కామన్ పాయింట్ ఉంటుంది. ఉదయం పూట చదివితే బాగా గుర్తుంటుంది. రాత్రి పడుకుని, తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి చదవమని సలహాలిస్తుంటారు. అయితే విద్యార్థులు మార్నింగ్ చదవడం కంటే రాత్రిపూట చదివితేనే లాభాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. నైట్ చదవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

నైట్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి శబ్దాలు వినిపించవు కాబట్టి.. పిల్లలు రాత్రి చక్కగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చదువుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటే.. పాఠాల్ని కూడా అంతే తొందరగా.. అర్థం చేసుకునే చాన్స్ ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే నైట్ చదివితే బాగా గుర్తుంటుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. పిల్లలు సృజనాత్మకం(Creative)గా ఆలోచించడం ప్రారంభిస్తారు. రాత్రి వేళ కొత్తగా థింక్ చేస్తారు. అంతేకాకుండా రాత్రి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

మైండ్ చురుగ్గా ఉంటే చదివింది తొందరగా అర్థమైపోతుంది. డే టైమ్‌లో చాలా డిస్టబెన్స్‌గా ఉంటుంది. దృష్టి ఫోన్‌పై మళ్లుతుంది. ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీ మెంబర్స్.. అందరితో మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకుంటారు. రాత్రి అయితే ఎవరు డిస్టబ్ చేయరు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి(mental stress)కి గురికాకుండా ఉంటారు. నైట్ 11,  12 గంటల వరకు చదివి పడుకుంటే మంచి నిద్రకు కూాడా అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల్లో ఆత్మ విశ్వాసం(self confidence) పెరుగుతుంది. కాగా పిల్లలు నైట్  టైమ్ చదవడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు. 

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు. 

Tags:    

Similar News