రెండు బైకులు ఢీ…యువకుడు మృతి

రెండు బైకులు ఢీకొని,యువకుడు మృతి చెందిన ఘటన దుద్యాల లో సోమవారం చోటు చేసుకుంది

Update: 2024-12-16 14:54 GMT

 దిశ బొంరాస్ పేట్ :- రెండు బైకులు ఢీకొని,యువకుడు మృతి చెందిన ఘటన దుద్యాల లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం… దుద్యాల మండల కేంద్రానికి చెందిన నీరటి బుగ్గప్ప (28) తను పనిచేస్తున్న దగ్గర స్నేహితుడి(విష్ణు)బైక్ (TS 06 ET2836) ను తీసుకొని, దుద్యాల గేట్ నుంచి దుద్యాలకు వస్తుండగా, దుద్యాలకు చెందిన గుండ్లపల్లి నర్సిములు దుద్యాల నుండి దుద్యాల గేటుకు వెళుతుండగా,మార్గమధ్యలో అతివేగంతో బుగ్గప్ప బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బుగ్గప్ప బైక్ పై నుండి క్రింద పడటంతో,తల వెనుక భాగంలో గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి నీరటి రుక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News