గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, యాచారం : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఏ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామం లోని బస్టాప్ వద్ద నిలబడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరుకోవడంతో పక్కనే ఉన్న ప్రయాణికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతి చెందాడని, మృతుడి వయస్సు (50) ఉంటుందని నల్లటి జుట్టు, పొడవు 5.6 అడుగులు ఉంటాడని, నల్లటి ప్యాంటూ, స్వెటర్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తు పడితే పోలీసులను సంప్రదించాలని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.