అచ్చం మనుషుల్లాగే.. ఒకటి రెండ్లు లెక్క పెడుతున్న కాకులు

కాకులు కూడా బిగ్గరగా లెక్కించగలవని తెలిపింది తాజా అధ్యయనం. పసి పిల్లల మాదిరిగా సంఖ్యా నైపుణ్యాలను కలిగి ఉంటాయని..

Update: 2024-06-04 14:35 GMT

దిశ, ఫీచర్స్: కాకులు కూడా బిగ్గరగా లెక్కించగలవని తెలిపింది తాజా అధ్యయనం. పసి పిల్లల మాదిరిగా సంఖ్యా నైపుణ్యాలను కలిగి ఉంటాయని.. ఒక పక్షికి మానవుల లాంటి న్యూమరసి స్కిల్స్ కలిగి ఉంటాయని గుర్తించడం ఇదే మొదటి సారి అని తెలిపింది. పసి బిడ్డల లాగా ఒకటి నుంచి నాలుగు వరకు లెక్కిస్తాయని.. దృశ్యం, స్వరానికి రియాక్ట్ అవుతున్నాయని తెలిపారు శాస్త్రవేత్తలు.

ప్రత్యేకమైన సంఖ్యలో స్వరాలను చేయడం ద్వారా ఖచ్చితంగా లెక్కిస్టాయని కనుగొనడం మొదటిసారి. నిజానికి నిర్దిష్ట సంఖ్యలో వాయిస్ ఉత్పత్తి చేయడానికి సంఖ్యా సామర్థ్యాలు మరియు స్వర నియంత్రణ అధునాతన కలయిక అవసరం. కాగా సంఖ్య వ్యవస్థను ఉపయోగించడం ద్వారా కాకులు సరళంగా, ఉద్దేశపూర్వకంగా సూచించబడిన సంఖ్యలో స్వరాలను ఉత్పత్తి చేయగలవని గుర్తించారు. అయితే ఇంతకు ముందు అనేక అధ్యయనాలు తేనెటీగలు, సింహాలు, కప్పలు, చీమలు అంతర్లీన సంఖ్యాపరమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయని చూపించాయి కానీ బిగ్గరగా లెక్కించే సామర్థ్యాన్ని పంచుకుంటాయనడానికి తగిన సాక్ష్యాలను అందించలేదు.


Similar News