పాలు తాగడం ద్వారా డయాబెటిస్ దూరం.. తాజా అధ్యయనం
పాలను సంపూర్ణ ఆహారంగా పేర్కొంటారు.
దిశ, ఫీచర్స్: పాలను సంపూర్ణ ఆహారంగా పేర్కొంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి మేలు చేసే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఆవు లేదా బర్రె పాలు తాగవద్దని చాలామంది భావిస్తుంటారు. ఇందులో హై ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్స్ కలిగి ఉండటంవల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని, ఒబేసిటీ, హైబీపీ వంటి సమస్యలు తలెత్తుతాయని అపోహ పడుతుంటారు. కానీ ఇదంతా నిజం కాదని చెన్నై అర్బన్ రూరల్ ఎపిడమాలజీ నిపుణుల స్టడీలో వెల్లడైంది. రోజూ ఒక గ్లాస్ పాలు తాగడంవల్ల డయాబెటిస్, ఒబెసిటీ, హైపర్‌టెన్షన్ వంటివి కూడా తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు.
అధ్యయనంలో భాగంగా నిపుణులు 27 దేశాల్లో 1, 30,000 మందిని పరరిశీలించారు. ఇందులో డయాబెటిస్ ఉన్నవారు, లేనివారు కూడా ఉన్నారు. డయాబెటిస్ లేనివారిపై దాదాపు 10 నుంచి 15 ఏళ్లపాటు అబ్జర్వేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా పాలు, పాల ఉత్పత్తులు వినియోగించిన వారిలోని ఆరోగ్య పరిస్థితులను పరిశోధకులు విశ్లేషించారు. ముఖ్యంగా యోగర్ట్, చీజ్, బటర్ వంటి పులిసిన పాల ఉత్పత్తులు డయాబెటిస్ ముప్పును తగ్గించాయని కనుగొన్నారు. అంతేగాక ఇవి ఒబేటిసిటీ, హైపర్ టెన్షన్ వంటి జీవక్రియ నిరోధకంగా పనిచేస్తాయని వెల్లడించారు.
Also Read: Heart Stroke : స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్న నిద్రలేమి.. 50 ఏళ్లలోపు వారిలోనే అధికం