Liver health: ఆల్కహాల్ మాత్రమే కాదు.. రాత్రిళ్లు ఈ అలవాటు కూడా లివర్‌ను దెబ్బతీస్తుంది!

ఆహారం, వ్యాయామాలే కాదు.. మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని వివిధ అవయవాలతోపాటు లివర్ కూడా కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-09-20 10:19 GMT

దిశ, ఫీచర్స్ : ఆహారం, వ్యాయామాలే కాదు.. మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని వివిధ అవయవాలతోపాటు లివర్ కూడా కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం వంటివి అందుకు కారణం అవుతాయనే విషయం తెలిసిందే. కానీ నిద్రలేమి కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఎఎఫ్ఎల్‌డి)కు కారణం అవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అధ్యయనంలో భాగంగా చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు మొత్తం 1,12,196 మందిలో నిద్ర అలవాట్లు వారి కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలించారు. అయితే అప్పుడప్పుడు మద్యం తాగేవారిలో కూడా నిద్రలేమి అలవాటు కారణంగా ‘లివర్ సిర్రోసిస్’ సమస్య ఏర్పడుతోందని ఉంటోందని, వీరితో పోలిస్తే నాణ్యమైన నిద్ర అలవాటు కలిగిన కాలేయ ఆరోగ్యం బాగుంటోందని గుర్తించారు.

ఇప్పుడు మద్యంతోపాటు దీర్ఘకాలిక నిద్రలేమి కూడా ఫ్యాటీ లివర్ డిసీజెస్ లేదా లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యకు దారితీస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల కాలేయంపై మచ్చలాంటి కణజాలం ఏర్పడుతోందని, కొవ్వు కూడా పేరుకుపోతుందని చెప్తున్నారు. ఈ పరిస్థతిలో కాలేయ పనితీరు మందగిస్తుంది. వికారంగా అనిపించడం, ఆకలి, బరువు తగ్గడం, చిన్న పనికే అలసిపోవడం, జుట్టు రాలడం, ముక్కు నుంచి రక్తం కారడం, కండరాల నిమ్మిరి వంటి లక్షణాలు ఈ సమయంలో కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే కాలేయ వైఫల్యానికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సరైన ఆహారం, నాణ్యమైన నిద్ర కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. 

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Similar News