తాజ్ మహల్ కింద 22 రహస్య గదులు.. వాటిలో ఏమున్నాయో తెలిసి...

తాజ్ మహల్.. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం, ఆధునిక ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్‌కు నిర్మించిన తెల్లని పాలరాతి సమాధి, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే వారసత్వ ప్రదేశాలలో ఒకటి.

Update: 2024-10-04 18:39 GMT

దిశ, ఫీచర్స్ : తాజ్ మహల్.. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం. ఆధునిక ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్‌కు నిర్మించిన తెల్లని పాలరాతి సమాధి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే వారసత్వ ప్రదేశం. కాగా ఇతర వారసత్వ ప్రదేశాల మాదిరిగానే... తాజ్ మహల్ దాని సొంత కథ, రహస్యాలను కలిగి ఉంది. ఈ నిర్మాణం కింద 'తేజో మహాలయ' అనే పురాతన శివాలయం శిధిలాలు, 22 రహస్య గదులు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇక్కడ హిందూ దేవతల విగ్రహాలు, బొమ్మలు నిల్వ చేయబడ్డాయని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమనే దానిపై చర్చ జరుగుతుంది.

తాజ్ మహల్ నేలమాళిగలో నిజానికి గదులు ఉన్నాయి. కానీ వాటి గురించి రహస్యంగా ఏమీ లేదు. ఇవి నిజంగా గదులు కావు. సమాధి నేలమాళిగలో తలుపు జతచేయబడిన పొడవైన వంపు గల కారిడార్. ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాళం వేసి ఉంచబడుతుంది. తాజ్ మహల్ కింద నిజానికి గదులు ఉన్నాయి, కానీ వాటి గురించి రహస్యంగా ఏమీ లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బేస్మెంట్ గదులు సమాధి, మినార్లకు నిర్మాణాత్మక మద్దతును అందిస్తాయి.

సంవత్సరాలుగా ఈ రహస్య గదులలోని విషయాల గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. చాలా మంది ఈ గదులు వేసవి వేడి నుంచి ఆశ్రయం కోసం ఉద్దేశించిన భూగర్భ గదిలో భాగమని చెప్పుకొచ్చారు. అయితే అత్యంత వివాదాస్పదమైనది.. ఈ గదులలో హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని, హిందూ దేవాలయాన్ని సమాధిగా మార్చారనే అంశం. 2022లో, అలహాబాద్ హైకోర్టు తాజ్ మహల్ నిజానికి శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయమని పేర్కొంటూ బిజెపి యువజన విభాగం నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 20కి పైగా తాళం వేసిన గదులలోని విషయాలపై వివరణాత్మక దర్యాప్తును కోరింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి ASI రహస్య గదులు అని పిలవబడే చిత్రాలను విడుదల చేసింది. ముఖ్యంగా గదులు 1978 వరకు పబ్లిక్ సందర్శకుల కోసం ఓపెన్ చేసే ఉన్నాయి.

పురాతన కాలంలో సమాధి దేవాలయంగా ఉందని 'తేజో మహాలయ' అని పిలిచేవారని తన అభ్యర్ధనలో బిజెపి యువజన విభాగం నాయకుడు పేర్కొన్నాడు. బహుశా నాల్గో శతాబ్దంలో ప్యాలెస్‌గా మార్చారని అభిప్రాయపడ్డాడు. తాజ్ మహల్ 1145 ADలో రాజా పరమర్ది దేవ్ చేత పూర్తి చేయబడిందని పిటిషనర్ వాదించాడు. స్మారక చిహ్నపు వాస్తవ చరిత్ర గురించి తెలపాలని కోర్టును అభ్యర్థించాడు.

Tags:    

Similar News