ముఖానికి ఆవిరి పడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?

ఆడవాళ్లు ముఖ సౌందర్యంపై ఎంత ఇంట్రెస్ట్ చూపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-05 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆడవాళ్లు ముఖ సౌందర్యంపై ఎంత ఇంట్రెస్ట్ చూపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నలుగురిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. కాగా ఏ పార్టీలు, ఫంక్షన్స్‌కెళ్లినా.. తప్పకుండా మేకప్, లిప్‌స్టిక్ ఉండాల్సిందే. కొంతమందైతే ముందురోజే ఫేషియల్ కూడా చేయించుకుంటారు. మరికొంతమంది నేచురల్ టిప్స్ తో అందానికి మెరుగులు దిద్దుతారు. శెనిగపిండి, పసుపు, కలబంద, దోసకాయ, పెరుగు వంటి వాటితో పలు చిట్కాలు ఫాలో అవుతుంటారు. నేచురల్ టిప్స్ లో ముఖానికి ఆవిరి పట్టడం కూడా ఒకటి. బ్యూటీ ట్రీట్మెంట్ లో కూడా ఆవిరి పడుతారన్న విషయం తెలిసిందే.

ఆవిరితో బోలెడు లాభాలు..

అయితే ఫేస్‌కు ఆవిరి పట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఆవిరి పట్టడం వల్ల స్కిన్ లోతుగా క్లీన్ అవుతుంది. మురికిని కూడా తొలగిస్తుంది. అలాగే మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు తెరచుకోవడంలో మేలు చేస్తుంది. బ్లాక్ హెడ్స్ కు చెక్ పెడుతుంది. స్కిన్ లో పేరుకుపోయిన అదనపు ఆయిల్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. జిడ్డు స్కిన్ దూరం అవుతుంది. అంతేకాకుండా చర్మం హైడ్రేట్‌గా మారుతుంది.

ఆరోగ్యవంతమైన స్కిన్ మీ సొంతం..

ఫేస్‌కు ఆవిరి పట్టడం ద్వారా హైడ్రా ఫేషియల్ లా ఉంటుంది. దీంతో బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరిగి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆవిరి పట్టడం ద్వారా పింపుల్స్‌కు కూడా చెక్ పెట్టొచ్చు. దీంతో మీ ముఖం నీటిగా కనిపిస్తుంది. అలాగే చర్మం కూడా రిలాక్స్ గా ఉంచడంలో హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తుంది.

ఎన్ని డేస్‌కు ఒకసారి పట్టాలి..?

కానీ ప్రతి రోజూ ఆవిరి పట్టకూడదు. రోజూ ఆవిరి పట్టడం మంచిది కాదు. రెగ్యులర్ గా ఫాలో అయితే మాత్రం చర్మ రంధ్రాలు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుంది. కాగా10 డేస్ కు ఒకసారి ఆవిరి పడితే చాలు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News