ఇలాంటి మనుషులకు దూరంగా ఉండండి.. లేదంటే జీవితంపై విరక్తి కలగొచ్చు...
మనుషులు సంఘజీవులు. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు.. బాధలను పంచుకునేందుకు.. కచ్చితంగా ఒకరు అవసరం అవుతారు. అయితే ఈ కనెక్షన్ అనేది మంచి వారితో ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు నిపుణులు.
దిశ, ఫీచర్స్ : మనుషులు సంఘజీవులు. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు.. బాధలను పంచుకునేందుకు.. కచ్చితంగా ఒకరు అవసరం అవుతారు. అయితే ఈ కనెక్షన్ అనేది మంచి వారితో ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు నిపుణులు. ఒకరి సహవాసం మనకు బూస్ట్ ఇచ్చేలా ఉండాలి కానీ లైఫ్ మీద విరక్తి కలిగేలా ఉండకూడదని అంటున్నారు. ఇలాంటి నెగెటివ్ పర్సన్స్ తో స్నేహం అస్సలు చేయకూడదని... వీలైనంత దూరంగా ఉండటమే బెటర్ అని చెప్తున్నారు.
ఎనర్జీ వాంపైర్స్
కలిసిన కొద్ది నిమిషాల్లోనే మీ శక్తిని, ఉత్సాహాన్ని హరించగల వ్యక్తులను ఫేస్ చేశారా? ఈ వ్యక్తులు తరుచుగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ నెగెటివ్ గా ప్రభావితం చేస్తారు. ప్రతిసారి విరుచుకుపడటం, విసుగు చెందటం, డిమాండ్ చేయడం ఉండొచ్చు. ఇలాంటి వారు మీ సమయం, శక్తి.. రెండింటినీ పీల్చేస్తారు. వారితో ఫ్రెండ్ షిప్ మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. రక్త పిశాచి రక్తాన్ని ఎలాగైతే పీలుస్తుందో.. వీరు మీ ఎనర్జీ వాంపైర్స్ గా ఉంటారు.
ఓవర్ అచీవర్
జీవితంలో ఎక్కువ సాధించిన వారు ముందుగా మోటివేటర్స్ గా అనిపించవచ్చు. చెప్పే ప్రతి విషయం స్ఫూర్తి దాయకంగా ఉండొచ్చు. కానీ పోను పోను సీన్ రివర్స్ అవుతుంది. ఇలాంటి వ్యక్తులు ప్రాక్టికల్ గా ఉండకుండా.. తమకు, ఇతరులకు అవాస్తవ అంచనాలను ఏర్పరుస్తారు. ఇది అధిక ఒత్తిడికి దారి తీస్తుంది. చుట్టూ ఉన్నవారితో పోటీని ఇమాజిన్ చేసుకుని.. బంధాలను బ్రేక్ చేసుకుంటారు.
గాసిప్ పర్సన్స్
ఎప్పుడు గాసిప్ చేసే, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, వ్యక్తిగత సరిహద్దులను గౌరవించక పోవడం చేసే వ్యక్తులను దూరం పెట్టమని సూచిస్తున్నారు నిపుణులు. పుకార్లను ప్రచారం చేయడం ద్వారా కలిగే పర్యవసానాలను దృష్టిలో ఉంచుకోకుండా.. ప్రైవేట్ విషయాల్ని షేర్ చేస్తారు. విషపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. అందుకే ఇలాంటి వ్యక్తులు మీ ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ ను నెగెటివ్ గా ఎఫెక్ట్ చేస్తారని.. వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
బాధితుడిని అనే ఫీలింగ్
ఎప్పడూ తనకు అన్యాయమే జరుగుతుందని ఆలోచించే వ్యక్తికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. సమస్యలు, ఎదురయ్యే సంఘటనలకు వారు బాధ్యత వహించే బదులు.. ఇతరులపై నిందలు వేస్తారు. పరిష్కారం గుర్తించడం, తప్పుల నుంచి నేర్చుకోవడం కంటే జీవితం ఎప్పుడూ తమకు అనుకూలంగా లేదనే ఫీలింగ్ లో బతికేస్తారు. ఈ వైఖరి చుట్టు పక్కల ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. విసుగు తెప్పిస్తుంది.
ఎమోషనల్ మానిపులేషన్
ఎమోషనల్ మానిపులేటర్స్ చుట్టూ ఉండటం చాలా హానికరం. ఇలాంటి వారు తమ స్వంత ప్రయోజనం కోసం ఇతరులను కంట్రోల్ చేసేందుకు.. ఎమోషనల్ స్ట్రెస్, రిగ్రెట్ ఫీలింగ్ వంటి అన్ని రకాల వ్యూహాలను ఉపయోగిస్తారు. ఎదుటివారి శ్రేయస్సు గురించి ఆలోచించకుండా.. సెల్ఫిష్ గా, బాధపెట్టేలా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారితో సహవాసం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని.. నిరంతరం ఆందోళన, నిరాశ చుట్టు ముడుతుందని చెప్తున్నారు.