ఉగాది పచ్చడి ఎందుకు తినాలి...?
తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణాదిలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా ఉగాది పండుగను... Special Story on Ugadhi Pacchadi
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణాదిలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా ఉగాది పండుగను జరుపుకుంటాయి. ఉగాది పండుగ రోజు ఉదయం పూజ చేసిన తర్వాత ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ పచ్చడిని ఆరు రుచుల కలయికతో తయారు చేస్తారు. కారం, తీపి, వగరు, పులుపు, ఉప్పు, చేదు వంటి ఈ రకాల రుచుల కలయితో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. చింతపండు, ఉప్పు, మామిడికాయ, వేపు పువ్వు, పచ్చి మిర్చి, బెల్లంతో ఆనవాయితీగా ఈ పచ్చడిని తయారు చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ పచ్చడిని తీసుకుంటారు. అయితే, ఈ పచ్చడి తీసుకోగానే నోటికి తీపిగా అనిపిస్తే ఆ సంవత్సరమంతా మంచే జరుగుతుందని, ఒకవేళ చేదుగా అనిపిస్తే కష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు అని నమ్ముతుంటారు. అయితే, ఈ పచ్చడిలో ప్రతి పదార్థం మనం ఆరోగ్యంగా ఉండేందుకు, అదేవిధంగా వచ్చే సంవత్సరంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ పచ్చడి మనకు శక్తిని అందిస్తుందని చెబుతుంటారు.
ఇవి కూడా చదవండి : Global Warming: గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే చర్యలు తీసుకోండి : ప్రపంచానికి యూఎన్ క్లైమేట్ సైన్స్ బాడీ వార్నింగ్