రూపాయి ఎలా పుట్టింది...?

మనం నిత్యం నిద్ర లేచిన దగ్గర నుంచి డబ్బులు లేనిది దాదాపుగా పనులు ముందుకు సాగవు. డబ్బుల కోసం...Special story of Rupee

Update: 2022-11-24 04:17 GMT

దిశ, వెబ్ డెస్క్: మనం నిత్యం నిద్ర లేచిన దగ్గర నుంచి డబ్బులు లేనిది దాదాపుగా పనులు ముందుకు సాగవు. డబ్బుల కోసం ఇంత కంటే ఎక్కువగా మీకు చెప్పనక్కర్లేదు. అయితే, డబ్బులను చూస్తున్నప్పుడు ఒక్కొసారి మనకు అనిపిస్తుంది. అసలు ఇంతకు ఈ రూపాయి ఎలా పుట్టింది అనే డౌట్ వస్తుంటది. ఈ డౌట్ చాలామందికి చాలా సార్లే వచ్చి ఉంటది.

అయితే, రూపాయి పేరు వెండి నాణెం నుంచి వచ్చిందని తెలుసా? సంస్కృతంలో రూప్యకం అంటే వెండినాణెం. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణేన్ని రూపాయి పేరుతో విడుదల చేశాడు. మన దేశంలో నాణేల తయారీ క్రీస్తు పూర్వం 600 నుంచే ఉంది. వెండితో చేసే వీటిని పురాణాలు కర్షపణాలు పణాలనేవారు. షేర్ షా ప్రవేశపెట్టిన రూపాయి నాణెం బరువు సుమారు 11.34 గ్రాములుండేది. అప్పట్లో రూపాయి అంటే పదహారు అణాలు. అంటే 64 పైసలు అన్నమాట. 1957లో రూపాయిని వంద నయా పైసలుగా విభజించారు.

మన దేశంలో మొదటిసారిగా కాగితం నోట్లను బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్(1770-1832), ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్(1773-75), బెంగాల బ్యాంక్ (1884-91)లు ముద్రించాయి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ నోట్లు మొదట్లో ఒకవైపు మాత్రమే ముద్రణతోనే వచ్చేవి. ఆ తర్వాత కొన్నాళ్లకు రెండు వైపుల ముద్రించడం స్టార్ట్ చేశారు. అయితే, బ్యాంకులకు బదులు ప్రభుత్వమే కరెన్సీని 1861లో విడుదల చేయడం స్టార్ట్ చేసింది. బ్రిటీష్ ఇండియా మొట్టమొదటి నోటు విక్టోరియా రాణి చిత్రంతో వచ్చింది. దాని విలువ పది రూపాయలు. మొట్టమొదటి వంద రూపాయల నోటు 1900లో విడుదలైంది. భారతీయ రిజర్వు బ్యాంక్ 1935లో ఏర్పిడింది. ఇది ఏర్పిడన తర్వాత కరెన్సీ ముద్రణ స్టార్ట్ అయ్యింది. అది 1938లో విడుదల చేసిన మొట్టమొదటి నోటు విలువ 5 రూపాయలు. అయితే, ఒక్క రూపాయి నోటును మాత్రం ప్రభుత్వమే విడుదల చేసేది.

అయితే, స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో 1858 వరకు మొఘల్ చక్రవర్తి పేరు మీద నాణేలు విడుదలయ్యేవి. ఆ తర్వాత అసఫ్ ఝా పేరుతో హాలి సిక్కా అనే నాణేలు చలామణిలోకి వచ్చినాయి. వీటిపై ఒక వైపు నాణెం విలువ, మరోవైపు చార్మినార్ ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినంక మన ప్రభుత్వం 1949లో మొట్టమొదటి రూపాయి నోటుని రూపొందించడం స్టార్ట్ చేసింది. ఆ నోటులో మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలిసారిగా ఉపయోగిస్తూ రూపొందించారు.

దేశంలోని వివిధ ఆఫీసుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ వ్యవహారాలను నిర్వహిస్తది. ప్రెస్ లు ముద్రించిన కొత్త నోట్లు, టంకసాలల(మింట్లు) నుంచి వచ్చిన నాణేలు ముందుగా ఆ కార్యాలయాలకే చేరుతాయి. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఉండే 4,422 (కరెన్సీ చెస్ట్ లు) కరెన్సీ కేంద్రాలకు చేరుకుంటాయి. ఆ తర్వాతనే అవి పంపిణీ అవుతాయి. 

Web 3.0 తో వినియోగదారుల డేటా చోరీని అరికట్టడమే లక్ష్యం.. 

Tags:    

Similar News