ఒక స్త్రీ పురుషుడి నుంచి ఏం కోరుకుంటది.. మీరెవరైనా చెప్పగలరా..?
ఇద్దరు పరుష వ్యక్తుల మధ్య ఓ చర్చ జరుగుతుంది. ఆ చర్చ పోటాపోటీగా సాగుతోంది. వారిరువురూ...Special Story
దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ చర్చ జరుగుతుంది. ఆ చర్చ పోటాపోటీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిరువురూ ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించుకుంటున్నారు. ఆ సమయంలో ఓ ప్రశ్నను మొదటి వ్యక్తి సంధించాడు. దీంతో రెండో వ్యక్తికి ఆ ప్రశ్నకు ఆన్సర్ తట్టలేదు. దీంతో మొదటి వ్యక్తి సమయం తీసుకునైనా లేదా ఇంకెవరి సలహానైనా తీసుకుని తనకు ఆన్సర్ ఇవ్వు అన్నాడు. దీంతో అతను ఆన్సర్ కోసం తనకు ఎదురైనా అందరినీ అడగడం మొదలుపెట్టాడు. పండితులు, పూజారులు, బోధకులు, నృత్యకారులు.. ఇలా అందరినీ అడిగాడు. అయితే, ఒక్కోరు ఒక్కో విధంగా చెప్పారు. ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే.. ఆస్తిపాస్తులు కావాలని ఇంకొందరు, శారీరక సుఖాలని కోరుతుందని మరికొందరు. ఇంకొంతమందేమో పిల్లలు, ఇళ్లు, కుటుంబం అని చెప్పారంటా. అయితే, అతను వారి మాటాలతో సంతృప్తి చెందలేదు. ఇలా రోజులు గడిచిందంటా. ఆ తర్వాత ఓ వృద్ధురాలిని అడుగగా అప్పుడు సమాధానం దొరికిందంటా. అది విని అతను ఆశ్చర్యపోయాడంటా.
ఆమె ఇచ్చిన సమాధానం ఏమంటే... 'ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి. కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు. అందువల్ల భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి. ఆమెకు కూడా ఓ మనసుందని, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని గుర్తించాలి. పురుషుడి మానవత్వం మొగ్గతొడిగితే తాను ఆ మనోక్షేత్రంలో పూవై పూస్తుంది' అని ఆమె సమాధానం ఇచ్చిందంటా. ఇది విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడంటా. ఆ సమాధానంతో సంతృప్తిచెందిన అతను ఆ సమాధానాన్ని రెండో వ్యక్తికి చెప్పి పందెం నెగ్గాడంటా.
Read more: