మూత్రాన్ని తాగునీటిగా మార్చేస్తున్న స్పేస్ సూట్..

2026లో చంద్రుని దక్షిణ ధృవంపై మనుషుల ల్యాండింగ్ .. 2030లో మార్స్ కు పంపించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది NASA. ఇందుకు అనుగుణంగా అనేక పరిశోధనలు చేస్తుంది. ఈ క్రమంలోనే ' ది ప్రొటోటైప్ ' స్పేస్ సూట్ డిజైన్

Update: 2024-07-15 16:56 GMT

దిశ, ఫీచర్స్: 2026లో చంద్రుని దక్షిణ ధృవంపై మనుషుల ల్యాండింగ్ .. 2030లో మార్స్ కు పంపించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది NASA. ఇందుకు అనుగుణంగా అనేక పరిశోధనలు చేస్తుంది. ఈ క్రమంలోనే ' ది ప్రొటోటైప్ ' స్పేస్ సూట్ డిజైన్ చేయించింది. వీల్ కర్నెల్ మెడిసిన్ అండ్ కర్నెల్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ సూట్.. మూత్రాన్ని తాగునీటిగా మారుస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడగా.. వాక్యూమ్-బేస్డ్ ఔటర్ కాథెటర్ యూరిన్ సేకరించిన ఐదు నిమిషాలలోపు డ్రింకింగ్ ట్యూబ్ ద్వారా వ్యోమగామికి నేరుగా శుద్ధి చేయబడిన నీటిని పంపుతుంది. నిరంతరం సరఫరా చేసేలా కంబైన్డ్ ఫార్వర్డ్-రివర్స్ ఆస్మాసిస్ యూనిట్‌ను కలిగి ఉంది.

కాగా వ్యోమగాములు ప్రస్తుతం తమ ఇన్ సూట్ డ్రింక్ బ్యాగ్ లో లీటరు నీటిని మాత్రమే కలిగి అంటున్నారు. ఇది లాంగ్ స్పేస్ వాక్స్ కోసం సరిపోదు. ఇక ఇప్పుడున్న మ్యాగ్జిమం అబ్జర్బెన్సీ గార్మెంట్స్ లీకేజ్ ప్రాబ్లమ్స్ తో విమర్శలు అందుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సైన్స్ ఫిక్షన్ మూవీ 'Duke ' నుంచి ప్రేరణ పొందిన శాస్త్రవేత్తలు ఈ సూట్ డెవలప్ చేశారు.


Similar News