పెస‌ర‌ప‌ప్పుతో సూప్ .. దీనితో ఆ సమస్యలు తగ్గించుకోవచ్చు!

సాధారణంగా రోజూ రకరకాల కూరగాయలతో వంటలు వండుకుంటాం.

Update: 2024-02-23 07:01 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా రోజూ రకరకాల కూరగాయలతో వంటలు వండుకుంటాం. అయితే మనం తరచుగా వంటల్లో ఉపయోగించే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సాధారణ మెంతికూర వంటకాలు కాకుండా, ఈసారి సూప్ ప్రయత్నించండి. ఈ సూప్ తినడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.అలాగే జ్వరం, దగ్గు తగ్గుతాయి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, పోషకమైనది అలాగే మీకు శక్తిని కూడా ఇస్తుంది. మీరు కూడా పెస‌ర‌ప‌ప్పుతో సూప్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకొని ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు:

పెసర పప్పు - 1 కప్పు

నీరు - 4 కప్పులు

జీలకర్ర - అర స్పూన్

పసుపు - పావు స్పూన్

ఎండుమిర్చి - 2

ఉల్లిపాయ - 1

టమోటా - 1

కొత్తిమీర - తగినంత

ఉప్పు - రుచికి తగినంత

పెస‌ర ప‌ప్పు సూప్‌ను త‌యారు చేసే విధానం:

ముందుగా పెసర పప్పును ఒక గిన్నెలో అరగంట నానబెట్టాలి. తర్వాత స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడు, జీలకర్ర, తురిమిన అల్లం వేయండి. ఆ తర్వాత మెంతి గింజలు వేసి వేయించాలి. తర్వాత క్యారెట్, గుమ్మడికాయ ముక్కలను వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మళ్లీ కదిలించి స్టవ్ మూత పెట్టాలి. రెండో విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. మిరియాలు, జీలకర్ర, ఉప్పు అల్లం పొడి వేసుకోవాలి. తర్వాత మెంతికూరతో గార్నిష్ చేయాలి. పెసరతో సూప్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.


Similar News