మిస్టేక్ జరిగితే SORRY ఎందుకు చెప్పాలి?.. రియల్ మీనింగ్ ఏమిటో తెలుసా?

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సాధారణంగా వాడే పదాల్లో సారీ (sorry) ఒకటి. దీని నిజమైన అర్థం ఏంటంటే..

Update: 2024-08-13 06:27 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సాధారణంగా వాడే పదాల్లో సారీ (sorry) ఒకటి. నలుగురిలో ఉన్నప్పుడు అనుకోకుండా తుమ్మినా, సడెన్‌గా మన కాలో, చెయ్యో ఇతరులకు తగిలినా ‘సారీ’ అనేస్తాం. పొరపాటున ఒకరికి కాల్ చేయబోయి.. మరొకరికి చేసినా అదే చెప్తాం. ఇలా రోజువారీగా జరిగే చిన్న చిన్న పొరపాట్లకు మనం ఇతరులకు సారీ చెప్తుంటాం. ఆంగ్ల పదమే అయినా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఓన్ చేసుకున్న ఒకే ఒక పవర్ ఫుల్ కామన్ వర్డ్ ఏదైనా ఉందంటే అది ‘సారీ’. మాత్రమే. మనకు ఎదుటి వ్యక్తిమీద ఎంత కోపం ఉన్నా సరే.. ఒక్క‘సారీ’తో చల్లబడిపోతాం. అదే దానికున్న గొప్పతనం.

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సారీ అనే పదం ఒక్కసారైనా వింటుంటాం లేదా మనమే ఇతరులకు చెప్తుంటాం. అలా చెప్పినవారు ఇతరుల విశ్వాసాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతను పొందుతుంటారు. కొన్నిసార్లు ఎంత పెద్ద వివాదం చెలరేగినా, మన తప్పులేకపోయినా ‘సారీ’ చెప్తేస్తే చాలు. ప్రాబ్లం అంతటితో సాలో అయిపోతుంది. అలాగనీ సమయం, సందర్భం లేకుండా ప్రతీ చిన్న విషయానికి కూడా సారీ చెప్పేస్తే బాగోదంటున్నారు నిపుణులు. దీనివల్ల కొందరు మనల్ని బలహీనులుగా చిత్రీకరించే అవకాశం లేకపోలేదు. కానీ ఇది చాలా అరుదు. మొత్తానికి సారీ పదం వాడుక వల్ల ప్రేమ, సామరస్యం, ఆప్యాయతలే ఉట్టిపడుతుంటాయి. కోపం, ద్వేషం వంటివి పారిపోతుంటాయి.

అవసరమైనప్పుడు సారీ అయితే చెప్తుంటాం. కానీ అసలు దీనికి అర్థం ఏమిటి? ఆ పదం వాడుకలోకి ఎందుకు వచ్చింది? అనే సందేహాం మీకెప్పుడైనా కలిగిందా? చాలామంది దీనికి తెలుగులో ‘నన్ను క్షమించండి’ అని అర్థం చెప్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అదే అర్థంలో యూజ్ చేస్తున్నారు కూడా. కానీ ఈ పదం పుట్టుకను పరిశీలిస్తే దాని అర్థం వేరుగా ఉందంటున్నారు నిపుణులు. నిజానికి ‘సారీ’ అనే ఆంగ్ల పదం ప్రాచీన జర్మన్, యూరోపియన్ కాలంలో ‘సరిగ్’ లేదా ‘సారో’ అనే పదం నుంచి వచ్చింది. భాషా నిపుణుల ప్రకారం దీని అర్థం ‘కోపం లేదా కలత చెందడం’ కానీ ఇప్పుడీ కోణంలో ఎవరూ వాడటం లేదు. ‘క్షమించండి’ అనే పదంగానే ‘సారీ’ని అందరూ వాడేస్తున్నారు.

Read More..

Donkey Marriage: గ్రాండ్‌గా గాడిదలకు పెళ్లి.. ఊరంతా కలిసి సెలబ్రేషన్స్ 

Tags:    

Similar News