ప్రాక్టీస్ లేదంటే పక్షులు కూడా శృతి తప్పుతాయి.. తాజా అధ్యయనం
సాంగ్ బర్డ్స్(మేల్ జీబ్రా ఫించెస్) పాట నేర్చుకోవడంలో, గుర్తుంచుకోవడంలో లాంగ్ టర్మ్ మెమొరీ కలిగి ఉంటాయి.
దిశ, ఫీచర్స్: సాంగ్ బర్డ్స్(మేల్ జీబ్రా ఫించెస్) పాట నేర్చుకోవడంలో, గుర్తుంచుకోవడంలో లాంగ్ టర్మ్ మెమొరీ కలిగి ఉంటాయి. పుట్టిన 90 రోజుల్లోనే తండ్రి నుంచి సంగీత పాఠాలు నేర్చుకుంటున్న పక్షులు.. నెక్స్ట్ లెవల్‌కు డెవలప్ చేసి నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్‌లో పాడే ప్రతిభను పొందుతాయి. సాధారణంగా మగ పక్షులు మాత్రమే రాగాలు తీసే సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. ఆడ పక్షులను అట్రాక్ట్ చేసేందుకు లేదా తమ భూభాగాలను రక్షించుకోవడంలో భాగంగా ఇతర మగ పక్షులకు సిగ్నల్ ఇచ్చేందుకు ఈ పాటలను ఉపయోగించుతాయి.
అయితే తాజా అధ్యయనంలో వీటి గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. తమ లైఫ్ టైమ్‌లో ఎన్నో వేల వేరియేషన్ సాంగ్స్ పాడే ఈ పక్షులు.. తమ పర్ఫార్మెన్స్ క్వాలిటీని మెయింటెన్ చేయాలంటే రోజూ ప్రాక్టీస్ చేయాల్సిందేనని తెలిపారు శాస్త్రవేత్తలు. రెండు వారాల పాటు పాడకుండా ఉన్నట్లయితే.. తక్కువ పిచ్‌లో పాడతాయని, రోజువారీ అభ్యాసాన్ని తిరిగి ప్రారంభించిన తర్వాత వెంటనే రికవర్ అవుతాయని వివరించారు.
Read more: