కొందరు నిజమనుకునే సాధారణ అపోహలు.. వాస్తవానికి అవి ప్రమాదకరం!

మన సమాజంలో లేదా ప్రకృతిలో మానవ మనుగడ విషయానికి వస్తే చాలామంది నిజం అనుకునేలా చేసే అపోహలు చాలానే ఉన్నాయి. వాస్తవంతో సంబంధం లేకుండా ప్రజలు వాటిని పాటిస్తుంటారు. కొన్నింటిని మనం మనం సినిమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా, చుట్టు పక్కల ప్రజల నుంచి కూడా వాటిని వీటిని గ్రహిస్తుంటాం.

Update: 2024-05-25 12:33 GMT

దిశ, ఫీచర్స్ : మన సమాజంలో లేదా ప్రకృతిలో మానవ మనుగడ విషయానికి వస్తే చాలామంది నిజం అనుకునేలా చేసే అపోహలు చాలానే ఉన్నాయి. వాస్తవంతో సంబంధం లేకుండా ప్రజలు వాటిని పాటిస్తుంటారు. కొన్నింటిని మనం మనం సినిమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా, చుట్టు పక్కల ప్రజల నుంచి కూడా వాటిని వీటిని గ్రహిస్తుంటాం. అందరూ పాటిస్తున్నారనో, చెప్తున్నారనో మనమూ అలాగే చేస్తుంటాం. కానీ అవి ఎంత వరకు వాస్తవం అని ఆలోచించగలిగితే నిజమేంటో తెలిసి పోతుంది. ప్రస్తుతం అనేకమంది నిజం అనుకుంటున్న మిథ్స్ ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి అవి ప్రమాదకరం. అలాంటి కొన్ని కామన్ మిథ్స్ ఏమిటో చూద్దాం.

కూల్ వెదర్‌లో లిక్కర్ తాగడం

చల్లటి వాతావరణంలో చిక్కుకున్నారా? లేకుంటే తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతున్నారా? బీర్ లేదా లిక్కర్ తాగండి అని చాలామంది సలహా ఇస్తుంటారు. అలా చేస్తే మీ శరీరంలో వేడి పెరుగుతుందని చెప్తారు. అందరూ ఇది నమ్ముతుంటారు. కానీ వాస్తవానికి నిజం కాదు. పైగా ఆల్కహాల్ స్కిన్ సర్ఫేస్ రక్త నాళాలు, కేశనాళికలను మరింత విస్తరింపజేస్తుంది. ఫలితంగా మిమ్మల్ని మరింత వేగంగా చల్లబరుస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి అవసరమైతే వేడి టీ లేదా కోకో తాగవచ్చు.

చలిమంటలతో..

ఎలాంటి చలి పరిస్థితుల్లో అయినా మనం ఈజీగా జీవించేయవచ్చు. పెద్ద పెద్ద మంటలు కూడా ప్రజలను సజీవంగా ఉంచుతాయని చెప్తుంటారు. కానీ ఎల్లప్పుడూ కరెక్ట్ కాదు. షెల్టర్ లేకుండా మాత్రం ఎవరూ ఉండలేరు. పైగా వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ బహిరంగ ప్రదేశంలో నిద్రించడం ప్రమాదకరం. అలాగే మీరు జీపీఎస్ ద్వారా ఎన్నడూ మోసపోలేరని అంటుంటారు. నిజమే కావచ్చు కానీ ఎప్పుడూ దానిపైనే ఆధారపడితే మోసపోవచ్చు. కొన్నిసార్లు మీ జీపీఎస్ యూనిట్ బ్యాటరీలు విరిగిపోయినా, డెడ్ అయినా సమస్య ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైనా దూరప్రాంతానికి వెళ్లినప్పుడు ‘మీ బ్యాక్ కంట్రీ’కి జీపీఎస్‌తో పాటు మ్యాప్ అండ్ కంపాస్‌ను తీసుకెళ్లండి.

జంతువులు తినేవి మనం కూడా..

జంతువులు ఆకులు, అలములు, గడ్డి, పచ్చి మాంసం వంటివి తిని ఎంత బలంగా ఉంటున్నాయి. అలాగే మనం కూడా ఉండవచ్చు అని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ఆచరణలో పనికి రాదు. మానవులకు షేరింగ్ బయాలజీ ఉన్నప్పటికీ ఇది సరైంది కాదు. ఎందుకంటే జంతువులు తినే వాటిని మనం ఎల్లప్పుడూ తినలేం. ఉదాహరణకు పక్షులు, ఉడుతలు తినే కొన్నిరకాల బెర్రీస్, వైల్డ్ మష్రూమ్స్ తింటే మనుషులు చనిపోతారు. పులిలాగా వేటాడి పచ్చి మాంసం తింటే ప్రాణాలు పోవచ్చు.

 తేనెటీగలు కుట్టకుండా..

గ్రామీణ ప్రజల్లో కొందరు ఇప్పటికీ ఈ అపోహను కలిగి ఉంటున్నారు. తేనెటీగలు దాడి చేయడానికి వస్తే ఈత వచ్చినవారు వాటి నుంచి తప్పించుకోవడానికి ఏ చెరువులోనో, బావిలోనో దూకితే తప్పించుకోవచ్చని చెప్తుంటారు. అలాగే నమ్ముతుంటారు. కానీ వాస్తవంగా అలా ఉండదు. నీటిలో దూకి మళ్లీ పైకి వచ్చినప్పుడు అవి మిమ్మల్ని కుడుతాయి. అందుకే అవి పూర్తిగా కనుమరగయ్యే వరకు పారిపోవడం, అవి దూరలేని ఏదైనా షెల్టర్‌ను కనుగొనడం చేయాలి.

పాము కాటు వేయగానే..

పాము కాటు వేసినప్పుడు విషం శరీరానికి పాకవద్దనుకుంటే కరిచిన చోట గాయం నుంచి నోటితో రక్తాన్ని పీల్చి వేయాలని చెప్తుంటారు. కానీ ఈ టెక్నిక్‌ నిజంగా పనిచేయదు. ఎందుకంటే కాటు వేయగానే విషం రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. పైగా ఆ గాయం నుంచి రక్తం పీల్చడానికి నోటిని ఆనించినప్పుడు ఎక్స్‌ట్రా బ్యాక్టీరియా మాత్రమే పంపిణీ చేయబడుతుంది. అదనంగా నోటిలోకి విషం వస్తుంది. కాబట్టి కాటు వేసిన వారికే కాకుండా, అలా రక్తాన్ని పీల్చిన వారికి కూడా ప్రమాదకరం.

పచ్చి మాసం తినొచ్చా?

కొందరు మంది పచ్చి మాంసం, వివిధ పచ్చి ఆహారాలు తినడం మంచిదని చెప్తుంటారు. కానీ అంత సేఫ్ కాదు. ఎందుకంటే పచ్చి జంతు మాంసంలో బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, ఇతర పురుగులు, వైరస్‌లు వంటి వ్యాధికారకాలు ఉంటాయి. అలాగే కొందరు నదులు, సముద్రాలు, బీచ్‌ల వద్దకు వెళ్లినప్పుడు అలల తాకిడికి కొట్టుకుపోవచ్చు. అలాంటప్పుడు ప్రమాదం నుంచి బయటపడాలంటే అలలకు వ్యతిరేకంగా ఈదాలని చెప్తుంటారు. ఇది నిజం కాదు. ఒడ్డుకు సమాతరం (లంబ కోణంలో) ఈదడంవల్ల ప్రవాహంలో కొట్టుకుపోకుండా తీరానికి చేరేందుకు హెల్ప్ అవుతుంది.

నీటి జాడ కోసం..

ఏదైనా అటవీ ప్రాంతంలో చిక్కుకున్నప్పుడు, రూరల్ ఏరియాలల్లో ప్రయాణిస్తున్నప్పుడు దగ్గరలో ఎక్కడైనా నీటి జాడను కనుక్కోవాలంటే పక్షులను అనుసరించాలని చెప్తుంటారు. కొన్ని నీటి పక్షులు, ఎగిరే పక్షులు అలా చేస్తాయి. కానీ ఎప్పుడూ అవి నీటికోసమే వెళ్తాయని గ్యారంటే ఏమీ లేదు. కొన్నిసార్లు అవి రాత్రిపూట గడపడానికి తెలిసిన క్లియరింగ్ వైపు కూడా ఎగురుతూ ఉంటాయి. అందుకే పక్షులను అనుసరించి మోసపోవద్దు.

మంచు గడ్డను తినవచ్చు ..

బాగా దాహం వేసినప్పుడు నీళ్లు లేకపోతే.. ఆ సమయంలో మీరు మంచు ప్రదేశంలో ఉంటే మంచు గడ్డను నోట్లో వేసుకోండి అంటుంటారు. కానీ అందులో కోల్డ్ ఎయిర్ ఉంటుంది. కాబట్టి దానిని తింటే మీరు హైడ్రేట్‌గా ఉండలేరు. పైగా బ్రెయిన్ కోర్ ఫ్రీజ్‌ను పొందే ప్రమాదం ఉంటుంది. అంటే మంచును తినడంవల్ల హైపో థెర్మియాకు దారితీస్తుంది. అలాగే ఎవరి మూత్రం వారు తాగితే హైడ్రేట్‌గా ఉంటారని కొందరు చెప్తుంటారు. వాస్తవం ఏంటంటే మూత్రం శరీరంలోని వ్యర్థ పదార్థాలతో నిండి ఉంటుంది. పైగా తాగడం అంత మంచిది కాదు.

ఎలుగుబంటి దాడి చేస్తే.. 

ఎలుగు బంటి కనిపించగానే అది దాడి చేయకుండా ఉండాలంటే కళ్లు మూసుకుని, కింద పడుకొని చనిపోయిన వ్యక్తిలా నటించాలనే కథను చాలా మంది విని ఉంటారు. కానీ దీనివల్ల ఎలుగు బంటి దాడి చేయకుండా ఉండదని చెప్పలేం. ఒక మదర్ ఎలుగు బంటి తన పిల్లలను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు అరుదుగా మాత్రమే ఇలా మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ కాదు. అందుకే ఎలుగుబంటి దాడి చేసే పరిస్థితిలో మీరు చిక్కకుంటే దాని నుంచి రక్షించుకునేందుకు బిగ్గరగా అరవడం, పారిపోవడం చేయాలి. అలాగే చెట్టు ఎక్కడం ద్వారా ఎలుగు బంటి దాడి నుంచి తప్పించుకోవచ్చు అంటారు. కానీ అవి కూడా అద్భుతంగా చెట్లు ఎక్కగలవు. చెట్టు ఎక్కడం అంత సేఫ్ కాదు. 


Similar News