ప్రతి చిన్న సమస్యకు మందులు వాడుతున్నారా? .. చాలా ప్రమాదం !
కొందరు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నివారణకు సంబంధించిన టాబ్లెట్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వంటివి యూజ్ చేస్తుంటారు. చాలామంది జలుబు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పితోపాటు అజీర్తి, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు తలెత్తగానే ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్ వాడుతుంటారు.
దిశ, ఫీచర్స్ : కొందరు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నివారణకు సంబంధించిన టాబ్లెట్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వంటివి యూజ్ చేస్తుంటారు. చాలామంది జలుబు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పితోపాటు అజీర్తి, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు తలెత్తగానే ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్ వాడుతుంటారు. మరికొందరు సాధారణంకంటే ఎక్కువగా మందులు యూజ్ చేస్తుంటారు. ఉదాహరణకు తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాట్లెట్ వాడాల్సి ఉండగా, త్వరగా తగ్గాలని రెండు లేదా మూడు వాడేవాడుతుంటారు. దీనినే ‘ఓవర్ ది కౌంటర్ పిల్స్’ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరం.
హార్మోనల్ ఇష్యూస్
ప్రతి ఆరోగ్య సమస్యకు సొంతంగా మందులు వాడటం హాని చేయనివిగా అనిపించవచ్చు. కానీ విచక్షణా రహిత ఔషధాల వినియోగం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగ స్త్రీలలో సంతానోత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ అవకాశాలపై ఎఫెక్ట్ చూపుతుంది. క్విక్ సొల్యూషన్ అందిస్తాయి కదా అని ఓవర్-ది-కౌంటర్ మాత్రలు వాడితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రధానంగా ఈ పద్ధతి స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు.
రీ ప్రొడక్టివ్ ఇంపాక్ట్స్
అవసరం లేకపోయినా టాబ్లెట్స్ వేసుకోవడం, టానిక్ తాగడం వంటి అలవాట్లతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ మెన్‌స్ట్రువల్ సైకిల్స్, డిస్రప్టెడ్ ఓవల్యూషన్ వంటి రీ ప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయి. అలాగే నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి కొన్ని మెడికేషన్స్ అండోత్సర్గము పనిచేయకపోవటానికి కారణం అవుతాయి. గర్భం దాల్చే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంకొన్ని మందులు వాడటంవల్ల గర్భధారణ సమయంలో సమస్యలు లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా వారి సంతానంలో పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం అవుతాయి. అందుకే ప్రతి చిన్న సమస్యకూ సొంతంగా మందులు వాడే ‘ఓవర్-ది-కౌంటర్’ పద్ధతికి స్వస్తి పలకాలని, సమస్యలు తలెత్తినప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ సలహాల తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.