Health tips: చలికాలంలో పల్లీ చక్కీలతో ఇన్ని ప్రయోజనాలా!!
దిశ, వెబ్‌డెస్క్: చలికాలం రానే వస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చలికాలం రానే వస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే, చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే కొంత మేర ఆరోగ్యం మెరుగు ఉంటుందని నిపుణులు అభిప్రాయం. అవేంటో తెలుసుకుందాం..
బెల్లం, పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో బెల్లం, పల్లీలతో కలిపి చేసిన చక్కీలు తింటే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా బెల్లంలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పల్లిల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతో పాటు మరెన్నో జౌషద గుణాలు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు రక్తహీనత తగ్గుతుంది. వేరుశనగలోని పీచు పదార్థం ఎసిడిటీ, మలబద్ధకాలను దూరం చేస్తుంది. దీంతో పాటుగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.