పెళ్లి చేసుకోబోయే ముందు తెలుసుకోవాల్సిన ఆరు సీక్రెట్స్..!
పెళ్లి అనేది కలల సౌధం. పెళ్లికి ముందు ఎన్ని కలలు కన్నా.. వాటిని నిజం చేసుకోవాలన్నా.. సమాజంలో ఆదర్శ జంటగా నిలబడాలన్నా.. వివాహం తర్వాత భార్యభర్తల బంధం బలంగా ఉండాలి.
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి అనేది కలల సౌధం. పెళ్లికి ముందు ఎన్ని కలలు కన్నా.. వాటిని నిజం చేసుకోవాలన్నా.. సమాజంలో ఆదర్శ జంటగా నిలబడాలన్నా.. వివాహం తర్వాత భార్యభర్తల బంధం బలంగా ఉండాలి. అందుకే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత లగ్న ఘడియలకు కనీసం నెల రోజుల సమయం తీసుకుంటారు పెద్దలు. ఈ మధ్య సమయంలో కాబోయే భార్యభర్తలు తన అభిరుచులను, ఇష్టాఇష్టాలను పంచుకోవడంతోపాటు భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటారని వారి నమ్మకం. అయితే పెళ్లి చేసుకోబోయే యువతీయువకులు ముఖ్యంగా ఈ ఆరు విషయాలను తప్పని సరిగా తెలుసుకుంటే వారి వైవాహిక బంధం ధృడంగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు. ఆ ఆరు సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.
* పెళ్లికి ముందే కాబోయే భాగస్వామి ఇష్టాలను, అయిష్టాలను, అభిరుచులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
* డబ్బుల ఖర్చు, పొదుపు విధానం తెలిసి ఉండాలి. ఇప్పటి వరకు ఎలా ఖర్చు చేశారో ఇద్దరికి అవగాహన ఉండాలి.
* వంటకాలు, దుస్తులు, నచ్చేవి, నచ్చని విషయాలు ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకోవాలి.
* పెళ్లి తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు..? మీ మీ ప్లాన్లు ఏంటో ముందే మాట్లాడుకోని ఓ అభిప్రాయానికి రావాలి.
* మీరు చిన్నప్పటి నుంచి ఎలాంటి వాతావరణంలో పెరిగారు. బంధాలు, స్నేహితులు ఒకరినొకరు పంచుకుంటే బెటర్.
* పెళ్లి తర్వాత పిల్లలను కనడం, భవిష్యత్ ప్లానింగ్ గురించి ముందే అవగాహనకు రావాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య దాపరికం లేకుండా ఉండాలి.
ఇలా ఈ ఆరు విషయాల్లో భాగస్వాముల మధ్య మంచి అవగాహన, ప్లానింగ్, ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే ఆ కుటుంబం చక్కగా ఏ సమస్యలు లేకుండా ఉంటుందని ఫ్యామిలీ కౌన్సిలర్లు సైతం పేర్కొంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. కాబోయే వధూవరులు ఈ విషయాలపై చర్చించుకుంటారు కదా..!
Read more:
కొబ్బరి బోండాలు చూపిస్తూ కవ్విస్తున్న Janhvi Kapoor