బెడ్ పై కూర్చుని భోజనం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
ప్రస్తుతం ప్రపంచంలో ఆచారాలు సంప్రదాయాల ప్రాధాన్యత అంతంత మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రపంచమె నెట్ వర్కింగ్ అయిపోయింది కదా..
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచంలో ఆచారాలు సంప్రదాయాల ప్రాధాన్యత అంతంత మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రపంచమె నెట్ వర్కింగ్ అయిపోయింది కదా..ఏది ఏమైన కొత్త టెక్నాలజీ అనుకూలంగా వ్యవహరించడం మంచిదే కానీ కొన్ని ఆచారాలు సంప్రదాయాలను మారవద్దు. ఎందుకంటే అది బయటికి మూఢనమ్మకాల అనిపించిన దానిలో సైన్స్ దాగి ఉందానే విషయం తెలుసుకోవాలి. అది ఏంటో చూద్దాం..చాలా మంది భోజనం చేసేటప్పుడు కుర్చీలో కూర్చుంటారు. మరికొంత మంది మంచం పై కూర్చొని తింటారు. అయితే పెద్దలు మంచం పై కూర్చొని తినద్దు అని చెప్పారు. కానీ చాలా మంది వారి మాటలు పట్టించుకోరు. సమాజంలో పడుకునే మంచం మీద తినే అలవాటు వందలో తొంభై మందికి ఉంటుంది. కానీ ఈ అలవాటు చెడ్డది. దీని వల్ల మనకి తెలియకుండానే చాలా సమస్యలు వస్తాయి. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. కొందరి ఇళ్లలో స్థలం లేకపోవడంతో మంచం పై కూర్చొని భోజనం చేయాల్సి వస్తోంది. అలాంటి వారు కచ్చితంగా నేలపై కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. బెడ్ మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలా మంది భోజనం చేసిన తర్వాత వెళ్లి పడుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. అస్సలు మంచం దగ్గరకు తినే ఆహారం తీసుకుని వెళ్లే అలవాటు మంచిది కాదు. బెడ్ మీద పేపర్ లేదా ప్లాస్టిక్ పెట్టుకుని బిర్యాని తింటుంటారు కానీ ఇది చాలా చెడ్డ అలవాటు. మనం హాయిగా నిద్ర పోవడానికి బెడ్ వాడాలి. కానీ బెడ్ మీద తినడం చాలా చెడ్డ అలవాటు.
మంచం పై కూర్చొని తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు?
మంచం మీద తినడం వల్ల అజీర్ణం కలుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతే కాదు సోమరితనం గా ఉంటుంది ఆ రోజంతా దీంతో నిటారుగా కూర్చొని తినడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని వల్ల వంగుతూ తినాల్సి వస్తుంది. కొందరైతే పడుకుని మరీ తింటారు. ఇది జీర్ణక్రియకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎప్పుడూ కుర్చీలో నిటారుగా కూర్చుని తినండి. ఇది పేగులకు మంచిది. బెడ్‌పై భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్‌పైనే కళ్లు ఉంటాయి. ఇది మనస్సును చెదరగొడుతుంది. ఫలితంగా కొందరు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అతిగా తినడం మీ నిద్రపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం ప్రమాదం పెరుగుతుంది. మరి కొందరైతే అసలు టీవీ చూసుకుంటూ ఉండిపోతారు. భోజనం చేయారు. దీంతో ఆకలి మందగిస్తుంది. నిజం చెప్పాలంటే మంచం మీద బ్యాక్టీరియా ఉంటుంది.దాని వల్ల మనం తినే ఆహారంలో పడిపోతాయి. మీరు తిన్న ఆహారం బెడ్ పై పడితే స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తుంది. ప్రశాంతమైన నిద్ర రావాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మంచి నిద్ర వస్తుంది. బెడ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అనారోగ్యకరమైన వాతావరణంలో అలెర్జీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మంచం మీద కూర్చుని తింటే మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. మీలో ఒత్తిడి ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది.