Mobile sim Trouble : మీ ఫోన్‌లో సిమ్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ఈ మధ్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లలో సిమ్ కార్డుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్ మాట్లాడుతుండగానే సడెన్‌గా..

Update: 2024-09-11 13:41 GMT

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లలో సిమ్ కార్డుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్ మాట్లాడుతుండగానే సడెన్‌గా కట్ కావడం, ఆ వెంటనే కాల్ డ్రాప్‌లో పడటం, ట్రబుల్ ఇవ్వడం వంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఇవి టెక్నాలజీ ప్రాబ్లం లేదా మీరు వాడే మొబైల్ ఫోన్ వేడెక్కడం వంటి కారణాల వల్ల కూడా సంభవించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఫోన్ రీ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కాకపోతే అది వేరే సమస్య అయి ఉండవచ్చని అనుమానాలించాలి.

ముఖ్యంగా సెడెన్ కాల్ డిస్ కనెక్టింగ్, కాల్ డ్రాప్, కాల్ ట్రబుల్ వంటివి మీరు ఎదుర్కొంటుంటే గనుక ఓసారి రీస్టార్ట్ చేసి చూడాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే.. అప్పుడు మీ సిమ్ కార్డు పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు స్కామర్లు స్పామ్ కాల్ చేయడంవల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే చాన్సెస్ ఉంటాయట. అలాగే మీరు సిమ్ తీసుకున్నప్పుడు కేవైసీ సరిగ్గా చేయకపోవడం, టెలికం రూల్స్ మారిన తర్వాత అప్‌డేట్ చేసుకోకపోవడం వంటివి కూడా ఇలా సిమ్ ట్రబుల్ ఇవ్వడానికి కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కోవడం, కవరేజ్ ఏరియాలో ఉన్నప్పటికీ నాట్ కవరేజ్ ఏరియా అని ఇతరులకు సందేశాలు వెళ్లడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే గనుక మీ సిమ్ కార్డ్ నెట్వర్క్ కార్యాలయాల్లో సరైన డాక్యుమెంట్స్ సమర్పించి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంతకు ముందు సంచార్ సాథి పోర్టల్‌లో కూడా స్పామ్ కాల్స్, సిమ్ ట్రబుల్ గురించి కంప్లైంట్స్ చేయడం ఇంకా బెటర్. దీంతో సంబంధిత టెలికాం ఆపరేటింగ్ విభాగాలు మీ సమస్యకు టెక్నాలజీ పరంగానే కాకుండా స్పామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ట్రాయ్ (TRAI) ఇటీవల పేర్కొన్నట్లు నిపుణులు చెప్తున్నారు. 


Similar News