అధిక బరువు పెరుగుతున్నారని తెలిపే సంకేతాలు..

ఊబకాయం వందలో తొంభై మందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గడం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవన శైలి విధానమే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తుంది.

Update: 2022-10-18 13:03 GMT

దిశ,ఫీచర్స్: ఊబకాయం వందలో తొంభై మందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గడం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవన శైలి విధానమే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్‌లతో సహా వివిధ అనారోగ్యాల సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఊబకాయం ఉన్నవారి శరీరంలో ఉండాల్సిన దానికంటే అదనంగా చెడు కొలెస్ట్రాల్ చేరుతుంది. దీని కారణంగా చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మనం బరువు పెరుగుతున్నప్పుడు మన బాడీలో కొన్ని సంకేతాలుంటాయంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం.

ఈ 8 రకాలు..

* విపరీతమైన దాహం

* అలసట

* చెదిరిన నిద్ర

* శ్వాసలో ఇబ్బంది

* విపరీతమైన ఆకలి

* అధిక చెమట

* బాడీ స్మెల్

* మెంటల్ డిజార్డర్

ఈ పైన తెలిపిన ఎనిమిది రకాలు మనం తప్పక గమనించుకోవాలి. ఒక వ్యక్తి తన శక్తికి మించి ఎక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే శరీరంలో అదనపు కేలరీలను కొవ్వుగా నిలుపుకుంటుంది. ముఖ్యంగా బర్గర్‌లు, పిజ్జాలు, వేయించిన ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసాలు, కుకీలు లేదా కేకులు, చక్కెర కలిపిన ఆల్కహాలిక్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. బరువు తగ్గించుకునేందుకు ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.

అలాగే ఇటీవల అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యానికి గురయ్యే మధ్య వయస్సు మహిళల్లో అధిక కొవ్వు శాతం, తక్కువ లీన్ మాస్‌తో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. వాయు కాలుష్యం కారణంగా శరీరంలో కొవ్వు 4.5 శాతం లేదా 2.6 పౌండ్ల వరకు పెరుగుతుంది. మధ్య వయస్కులైన మహిళల బరువు, వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), నడుము పరిమాణం, శరీర కొవ్వుల మధ్య సంబంధం ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ముక్కును మాస్క్‌తో కప్పిపెట్టాలి. యూవీ రేస్‌ను నివారించేందుకు గాగుల్స్‌ ధరించాలి. లేదంటే గొడుగు పట్టుకెళ్ళాలి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాదాపు వెళ్లకుండా ఉండటమే మేలు అని చెబుతున్నారు.

Tags:    

Similar News