భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. షాకింగ్ వీడియో వైరల్

మనం నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తుంటాము.

Update: 2024-04-08 15:50 GMT

దిశ, ఫీచర్స్: మనం నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తుంటాము. వాటిలో కొన్ని మనకు ఆనందాన్ని పంచితే మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కోవకు చెందిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధారణంగా చాలా సార్లు బైకుల మీదా వెళ్లినప్పుడు కొన్ని జంతువులు ఎటాక్ చేస్తుంటాయి. ఈ కారణంగా మనం కింద పడిపోవడమో, లేక వేరే వెహికల్స్‌కి డాష్ ఇవ్వడమో చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొంత మందికి తీవ్రమైన దెబ్బలు తగిలితే కొంత మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఎదురవుతోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే నిజంగా ఈ వ్యక్తి యముడికి హాయ్ చెప్పి వచ్చాడా అనిపిస్తుంది. బెంగుళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఓ వ్యక్తి తన బైక్‌పై నెమ్మదిగా వెళ్తున్నాడు. అదే సమయంలో అతనికి ఎదురుగా ఓ గంగిరెద్దును తీసుకుని ఓ మహిళ వస్తుంది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న గంగిరెద్దు ఒక్కసారిగా ఆ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మీదకు దూకింది. దీంతో ఆ వ్యక్తి.. అటుగా వెళ్తున్న లారీ కింద పడిపోయాడు. అయితే.. సడెన్‌గా చూస్తే చక్రాల కింద పడ్డాడ అనిపిస్తుంది. కానీ, ఆ లారీ డ్రైవర్ రెప్ప పాటు మేరకు బ్రేక్ వెయ్యడంతో ప్రాణాలతో బయట పడ్డాడు బైక్ నడిపే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్టు ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 



Similar News