Shocking News: భార్యపై ఎయిడ్స్ సోకిన వ్యక్తితో అత్యాచారం చేయించిన భర్త... ముసలోడే కానీ..
ఫ్రెంచ్ రేప్ కేసు మరోసారి వైరల్ అవుతుంది. తనపై భర్త డొమినిక్ పెలికాట్(71) 50మందితో అత్యాచారం చేయించాడని ఫిర్యాదు చేసిన భార్య గిసెల్ కేసులో నమ్మలేని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
(Note: Sensitive Content)
దిశ, ఫీచర్స్ : ఫ్రెంచ్ రేప్ కేసు మరోసారి వైరల్ అవుతుంది. తనపై భర్త డొమినిక్ పెలికాట్(71) 50మందితో అత్యాచారం చేయించాడని ఫిర్యాదు చేసిన భార్య గిసెల్ కేసులో నమ్మలేని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో బహిరంగ విచారణ జరుగుతుండగా.. బాధితురాలి కూతురు కరోలిన్ డారియన్ తన పుస్తకంలో రాసుకొచ్చిన విషయాలు సగటు మహిళ జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయి. తల్లికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయించే తండ్రి.. ఆమె ఎనర్జీ డ్రెయిన్ అయిపోయి, తూలిపోయినా పట్టించుకునేవాడు కాదని చెప్పింది. అంతేకాదు తల్లిని ఒక వేశ్య మాదిరిగా డ్రెస్సులు వేసుకోవాలని వేధించేవాడని రాసుకొచ్చింది.
కొంతమంది పురుషులు కండోమ్ ధరించకుండా అడ్డుకుని తల్లిపై రేప్ చేయించాడని... HIV కలిగిన వ్యక్తిని కూడా ఇన్వైట్ చేశాడని తెలిపింది. స్త్రీ జననేంద్రియ సమస్యలను ఎదుర్కొంటున్నానని, లైంగికంగా సంక్రమించే వ్యాధితో బాధపడుతున్నానని భార్య ఫిర్యాదు చేసినప్పుడు.. తను ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని ఆరోపించినట్లు చెప్పింది. తల్లిని దుర్భాషలాడాడని... మానసికంగా, శారీరకంగా హింసించాడని వివరించింది. ఇక దాదాపు 72 మందితో అత్యాచారం చేయించిన తండ్రి.. దీని నుంచి డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేయలేదని, కేవలం ఆయన స్వార్థపూరితమైన, పైశాచిక ఆనందం కోసమే ఇదంతా చేశాడని తెలిపింది.
కాగా పెలికాట్ కూడా తన తప్పులను కోర్టులో ఒప్పుకున్నాడు. అయితే తాను ఇలాంటి పనులు చేసేందుకు తన బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనలు కారణమని తెలిపాడు. తొమ్మిదేళ్లకే లైంగికంగా హింస, పన్నెండేళ్లకు రేప్ ఎటాక్ లాంటివి తనను ఇలా మలిచాయని.. భార్యపై ఇలా పదేళ్లపాటు అత్యాచారం చేయిస్తూ అనందించేలా చేశాయని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా...బాల్యంలో ఎంత ఇబ్బంది పడినా భార్య పట్ల మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పెలికాట్ ఓ సూపర్ మార్కెట్ లో మహిళల స్కర్ట్ ఫోటోలు తీస్తున్నాడని సెక్యూరిటీ గార్డు పట్టుకోవడం.. పోలీసుల విచారణ జరగడంతో.. ఈ నిజాలు బయటకు వచ్చాయి. సెప్టెంబర్ 2020లో ఈ ఘటన బయటపడగా... ఈ ఏడాది విచారణ పూర్తి కానుంది.