ఊబకాయం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ఆ పనికి కూడా శత్రువేనట..

ఊబకాయం వివిధ వ్యాధులకు మూల కారణం అంటుంటారు.

Update: 2024-03-25 15:40 GMT

దిశ, ఫీచర్స్ : ఊబకాయం వివిధ వ్యాధులకు మూల కారణం అంటుంటారు. ఇది ఒక వ్యక్తిని శారీరకంగానే కాకుండా మానసికంగా, సామాజికంగా కూడా హాని చేస్తుంది. ఊబకాయం పై చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం భారతదేశంలో దాదాపు 50 శాతం విడాకులు లైంగిక అసంతృప్తి కారణంగా జరుగుతున్నాయని తేలింది. దీనికి ప్రధాన కారణం భాగస్వాముల్లో ఒకరికి ఊబకాయం. అందుకే ఊబకాయం లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్థూలకాయం వైవాహిక జీవితంలో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఊబకాయం సెక్స్ డ్రైవ్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒక జంటలో ఒకరు ఊబకాయంతో ఉన్నట్లయితే, అతను లేదా ఆమె తన భాగస్వామిని సెక్స్ చేయడానికి ప్రేరేపించలేరని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్థూలకాయం కారణంగా, శరీర ఆకృతి క్షీణిస్తుందట. లావుగా ఉన్న శరీరం కారణంగా వారు సెక్స్ చేస్తున్నప్పుడు సుఖంగా ఉండలేరని, దాని కారణంగా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే స్థూలకాయాన్ని సెక్స్‌కి శత్రువుగా భావిస్తారట.

లైంగిక కార్యకలాపాల పై ఊబకాయం ప్రభావం..

లైంగిక కార్యకలాపాలు నిర్వహించడానికి కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉండటం, శరీరం శక్తివంతంగా ఉండటం అవసరం అంటున్నారు నిపుణులు. లావుగా ఉండటం వల్ల భాగస్వామి సెక్స్‌లో సంకోచించడం, సిగ్గుపడడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయంటున్నారు. వారు బహిరంగంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనలేరని చెబుతున్నారు. ఫలితంగా వారు భావప్రాప్తి పొందడంలో ఇబ్బంది పడుతుంటారట. చాలా మంది మహిళలు సంభోగం సమయంలో నొప్పి లేదా తొడ కండరాలలో ఒత్తిడి కారణంగా సెక్స్ చేయాలనే కోరికను కూడా కోల్పోతారని చెబుతున్నారు.

దెబ్బతింటున్న హార్మోన్ల సమతుల్యత..

శరీర కొవ్వు పెరుగుదల కారణంగా, టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఇది లిబిడో తగ్గడానికి కారణమవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరంలో కొవ్వు ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు, అది సెక్స్ డ్రైవ్‌ పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ హార్మోన్ పురుషుల శరీరంలో కనిపిస్తుంది. అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఊబకాయం ఉన్న పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయి 50 శాతం తగ్గుతుందట. టెస్టోస్టెరాన్ లోపం వంధ్యత్వానికి కారణమవుతుందని పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు. ఊబకాయం కారణంగా, పురుషుల అంగస్తంభన, శీఘ్ర స్కలనంతో బాధపడుతుంటారట. అందుకే సెక్స్ సమయంలో పురుషుల్లో త్వరగా స్కలనం అవుతుందని చెబుతుంటారు. దీని కారణంగా వారు తమ భాగస్వామికి లైంగిక సంతృప్తిని ఇవ్వలేరట.

లిబిడోను తగ్గిస్తున్న మందులు..

ఊబకాయం గుండె జబ్బులు, అంగస్తంభన లోపం, అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధులలో శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదని, ఫలితంగా ధమనులు నిరోధించడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్త ప్రసరణ జననాంగాలకు సరిగ్గా చేరలేదని వివరిస్తున్నారు. అలాంటప్పుడు వారు మందులు వాడాల్సి వస్తుంది. ఈ వ్యాధులకు తీసుకునే మందులు లిబిడోను కూడా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.

మానసిక స్థితి పై ప్రభావం..

ఊబకాయం మానసిక స్థితి పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. చెడు మానసిక స్థితి లైంగిక కార్యకలాపాలకు అవరోధంగా మారుతుందట. అధిక బరువు శక్తిని ప్రభావితం చేస్తుందట. తక్కువ స్టామినా కారణంగా, ఉద్వేగం చేరుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News