సెక్స్ తర్వాత యూరిన్ చేస్తే గర్భం రాదు?

ఈ మధ్య సంతానలేమి సమస్యలు పెరుగుతుండటంతోపాటు దాని చుట్టూ అనేక అనుమానాలు, అపోహలు కూడా ఉంటున్నాయి.

Update: 2023-05-01 08:51 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య సంతానలేమి సమస్యలు పెరుగుతుండటంతోపాటు దాని చుట్టూ అనేక అనుమానాలు, అపోహలు కూడా ఉంటున్నాయి. సైంటిఫిక్ ఆలోచనలతో సంబంధం లేకుండా అనేక మంది తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు. తెలిసో తెలియకనో కొందరు పాటిస్తుంటారు. అలాంటి అపోహల్లో ఒకటి మహిళలు సెక్స్ తర్వాత యూరిన్‌ చేయడం వల్ల గర్భం రాదనేది. అలా వెళ్లడంతో యోని నుంచి యూరిన్‌తోపాటు స్కలనం చేయబడిన స్పెర్మ్ కూడా బయటకు వస్తుందని.. ఈ కారణంగా గర్భం దాల్చే అవకాశం లేకుండా పోతుందని అపోహ పడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదంటున్నారు నిపుణులు.

కలయిక సమయంలో స్త్రీ శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫెరోమోన్లు స్పెర్మ్‌ను ఆకర్షిస్తాయి. సంతానానికి కావాల్సిన స్పెర్మ్‌ను యోనిలోకి గ్రహిస్తాయి. కాబట్టి నిస్సందేహంగా మూత్ర విసర్జన చేయొచ్చు. అయితే యూరిన్‌ వెళ్లినప్పుడు మిగిలి ఉన్న కొంత సెమినల్ ద్రవం విడుదల కావడం మామూలే. కొన్ని స్పెర్మ్ యోని నుంచి బయటకు పోయినప్పటికీ స్త్రీ అండాశయంలో ఫెర్టిలిటీకి తగిన స్పెర్మ్ మాత్రం ఎక్కువ శాతం లోపలే ఉంటుంది. కాబట్టి అనుమానాలు అక్కర్లేదు. పైగా సెక్స్ సమయంలో పురుషాంగం నుంచి మహిళల ప్రయివేట్ పార్ట్‌లోకి కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా.. యూరిన్ ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే సెక్స్‌లో పాల్గొన్న 30 నిమిషాలలోపు మహిళలు యూరిన్ కోసం వెళ్లడం, నీటితో యోని ప్రాంతాన్ని శుభ్రం చేయడం మంచిదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. 

Read more:

అక్కాతమ్ముళ్ల రొమాన్స్.. సీక్రెట్‌గా ఇద్దరు పిల్లలను కూడా కనేశారు

Tags:    

Similar News