COUPLE GOALS: భాగస్వామికి గుడ్ మార్నింగ్ చెప్పి, హగ్ ఇచ్చాకే మరో పని.. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ జంతువు ప్రవర్తన..

మనుషులే కాదు జంతువులు కూడా తమ భాగస్వామికి కట్టుబడి ఉండేవి ఉన్నాయి. ఇప్పుడు మానవులు విడాకులు తీసుకుని మరో పార్టనర్ ను వెత్తుక్కుంటున్నా.. కొన్ని జంతువులు మాత్రం తమ జీవితంలో ఒక్కరికే చోటు ఇస్తున్నాయి. అవి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాయి.

Update: 2024-08-23 09:00 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులే కాదు జంతువులు కూడా తమ భాగస్వామికి కట్టుబడి ఉండేవి ఉన్నాయి. ఇప్పుడు మానవులు విడాకులు తీసుకుని మరో పార్టనర్ ను వెత్తుక్కుంటున్నా.. కొన్ని జంతువులు మాత్రం తమ జీవితంలో ఒక్కరికే చోటు ఇస్తున్నాయి. అవి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాయి. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పెంగ్విన్స్ కాగా మరో ఉదాహరణ సీ హర్స్. నిజానికి ఈ నీటి గుర్రాలకు ఓ స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలో గర్భం ధరించే ఒకే ఒక మగ జాతి ఇదే. కాగా తాజా అధ్యయనంలో మరో విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది.

భాగస్వాములుగా ఉన్న నీటి గుర్రాలు ఉదయం లేవగానే ఒకదాన్ని ఒకటి విష్ చేసుకుంటాయట. డ్యాన్స్ చేస్తూ మరి హగ్స్ ఇచ్చుకుంటాయట. సంతోషం ఎక్కువైతే రంగులు కూడా మార్చుకుంటాయని తెలిపారు పరిశోధకులు. తమ పార్టనర్ బతికి ఉన్నాడని తెలుసుకునేందుకు ఇలా చేస్తాయని.. ఆ తర్వాతే ఆహార సేకరణకు బయల్దేరుతాయని చెప్పారు. ఈ యాక్ట్ రిప్రొడక్టివ్ సైకిల్ సింక్రోనైజ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

Tags:    

Similar News