రంగురంగుల్లో సముద్ర చేప.. మొదటిసారిగా వెలుగులోకి
దిశ, ఫీచర్స్ : సముద్రపు లోతుల్లో నివసించే రహస్య జీవరాశులపై అన్వేషణలో భాగంగా పరిశోధకులు రోజుకో వింత జీవిని గుర్తిస్తూ.. వాటి ప్రయోజనాలేంటో వివరిస్తున్నారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సముద్రపు లోతుల్లో నివసించే రహస్య జీవరాశులపై అన్వేషణలో భాగంగా పరిశోధకులు రోజుకో వింత జీవిని గుర్తిస్తూ.. వాటి ప్రయోజనాలేంటో వివరిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సముద్ర చేప ఒకటి మొదటిసారిగా కనిపించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సముద్రపు బాబాకినా అనాడోని స్లగ్ జాతికి చెందిన ఈ చేపలను 'అయోలిడ్ నుడిబ్రాంచ్' అని పిలుస్తారు. ఇవి మనిషి చిటికెన వేలు కంటే చిన్నగా ఉండి విభిన్న రంగులు ప్రదర్శిస్తుంటాయి. స్పెయిన్ జలాల్లో నివసించే ఈ ఫిష్‌లు.. ఇటీవల స్కిల్లీ దీవుల్లో సీసెర్చ్ వలంటీర్ అలెన్ ముర్రే కెమెరాకు చిక్కాయి.
'ఈ రంగురంగుల నుడిబ్రాంచ్‌ను చూడటం ఇదే మొదటిసారి. నేను చూసిన అందమైన సముద్రపు స్లగ్స్‌లో ఇది ఒకటి' అని కార్న్‌వాల్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌కు చెందిన మెరైన్ కన్జర్వేషన్ ఆఫీసర్, సీసెర్చ్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాట్ స్లేటర్ అన్నారు. సాధారణంగా వెచ్చని నీటిలో కనిపించే ఈ జాతి చేపలు 1979లో మొట్టమొదటిసారి వెలుగులోకి వచ్చాయి.