Viral : రాళ్లను ముద్దాడితే పెళ్లి..! నగ్నంగా పరుగెడితే అదృష్టం!!

Viral : రాళ్లను ముద్దాడితే పెళ్లి..! నగ్నంగా పరుగెడితే అదృష్టం!!

Update: 2024-12-12 09:53 GMT

దిశ,ఫీచర్స్ : వాస్తవాలా కాదా అనేది కాసేపు పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో క్యూరియాసిటీని పెంచే వింతలు, ఆశ్చర్యానికి గురిచేసే ఆచార సంప్రదాయాలు , నమ్మకాలు చాలానే ఉన్నాయి. ఇండియా సహా అనేక దేశాల్లో నమ్మకాలు, ఆచారాల పేరుతో పలు మూఢనమ్మకాలను కూడా ప్రజలు అనుసరిస్తుంటారు. ఎంతో డెవలప్ కంట్రీస్‌గా పేర్కొనే అమెరికా, యూరప్ దేశాల్లోనూ ఇవి ఉన్నాయనే ప్రచారం తరచుగా సోషల్ మీడియా వేదికల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి కొన్ని వింతైన ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాక్ కిస్సింగ్‌తో పెళ్లి..

పెళ్లికి, రాళ్లకు ఏంటి సంబంధం అనిపించవచ్చు కానీ.. యునైటెడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో గల పలు గ్రామాల్లో ఇందుకు సంబంధించిన ఓ వింతైన ఆచారం ఉంది. ఏంటంటే.. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు శుభ కార్యాల సందర్భంలో రాళ్లను ముద్దాడితే అదే ఏడాది ఎంగేజ్‌మెంట్ లేదా పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. అయితే పదే పదే ముద్దాడ కూడదు. ఏడాదికి ఒకసారే ఇలా చేయాలి. ఇక ఇక్కడి వెస్లీ (wellesley) కాలేజీలోని క్యాంపస్‌లో గల ఒక రాతిని ముద్దాడితే కూడా త్వరగా పెళ్లి అవుతుందని, లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ పరంగా సమస్యలు రావని, అదృష్టం కలిసి వస్తుందని నమ్మతారు. శతాబ్దాల క్రితం నుంచి ఇది కొనసాగుతోందని అక్కడి ప్రజలు చెప్తారు.

చెట్టుకు చెప్పులు కడితే లవ్ సక్సెస్

అమెరికాలోని కెంటకీ ముర్రే స్టేట్ యూనివర్సిటీలో గల చెట్టుకు చెప్పులను వేలాడ దీసే ఆచారం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడున్న ఇలా దీయడంవల్ల లవ్ సక్సెస్ అవుతుందని పలువురు యువతీ యువకులు నమ్ముతారు. 60 ఏండ్ల కిందట ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక తాను సక్సెస్ అయ్యాననే ఆనందంలో చెప్పులను ఈ చెట్టుకు వేలాడ దీశాడట. ఇక అప్పటి నుంచి అక్కడ చెప్పులు వేలాడ దీస్తే సక్సెస్ వరిస్తుందని చాలామంది నమ్ముతూ వస్తున్నారు.

అర్ధనగ్నంగా రన్నింగ్

అమెరికన్ మసాచుసెట్స్ విలియమ్స్ కాలేజీలో ఒక వింతైన ఆచారం ఉంది. ఇక్కడ కొత్తగా చేరిన స్టూడెంట్స్ తమ హాస్టల్ నుంచి కాలేజీ క్యాంపస్ వరకు అర్ధనగ్నంగా రన్నింగ్ చేయాలట. దీనివల్ల చదువు బాగా వస్తుందని నమ్ముతారు. 1940 నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. క్రమంగా అదొక సంప్రదాయంగా మారిపోయింది.

సమాధిలో పడుకొని..

యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూ హెవెన్‌లో గల యేల్స్ యూనివర్సిటీలో స్కల్ అండ్ బోన్స్ పేరుతో ఒక సీక్రెట్ స్టూడెంట్ గ్రూప్ ఉందట. వీరు వింత వింత ఆచారాలను పాటిస్తుంటారు. కొత్తగా ఈ గ్రూపులో చేరిన వారు సమాధిలో పడుకొని పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం వల్ల జీవితాంతం తమ బంధం విడిపోదని నమ్ముతారు. మూఢ నమ్మకమే కావచ్చు కానీ.. ఈ ఆచారాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు అక్కడి కొద్దిమంది స్టూడెంట్స్.

నగ్నంగా పరుగెత్తడం

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా స్కాట్లాండ్‌లోని ఆండ్రూస్ యూనివర్సిటీలో ‘ది నేకెడ్ మైల్’ అనే ఒక వింతైన ఆచారాన్ని గత పదేండ్ల క్రితం వరకూ పాటించేవారట కొందరు. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వర్సిటీ క్యాంపస్‌లో నగ్నంగా పరుగెత్తాలి. దీనివల్ల చదువు బాగా వస్తుందని, అదృష్టం కలుగుతుందని నమ్మేవారు. ఆధునిక కాలంలో ఇలాంటి మూఢాచారాలేమిటనే విమర్శల నేపథ్యంలో ఇది వివాదాస్పదమైంది. దీంతో యూనివర్సిటీ ఈ చారాన్ని క్యాంపస్‌లో బ్యాన్ చేసింది. కానీ కొందరు విద్యార్థులు రహస్యంగా ఇప్పటికీ ఫాలో అవుతారనే టాక్ ఉంది.

చంద్రుడిని కీర్తిస్తూ పాడటం

జపాన్‌లోని కొన్ని గ్రామాల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంలో విద్యార్థులు చంద్రున్ని కీర్తిస్తూ లేదా పొగుడుతూ పాటలు పాడే ఆచారం ఉంది. దీనివల్ల తాము చదువులో, వ్యక్తిగత విషయాల్లో రాణిస్తామని నమ్ముతారు. చంద్రుడిని ప్రస్తావిస్తూ, రాత్రిళ్లు చంద్రుడివైపు చూస్తూ పాడితే జ్ఞానం లభిస్తుందని, అదృష్టం వరిస్తుందని ఇక్కడి విద్యార్థులు, ప్రజలు చెప్తారు. అలాగే ఇండోనిషియాలోని బాలీలో కొందరు విద్యార్థులు తమకు అదృష్టం వరించాలని, వచ్చే జన్మలోనూ మేలు జరగాలని కోరుతూ గుండె చేయించుకునే ఆచారం ఉంది. ఇక దక్షణిఫ్రికాలోని ప్రిటోరియా వర్సిటీలో ఫైనలియర్ ఎగ్జామ్స్ సమయంలో సెయింట్ లూసియా పిరిమిడ్‌ను ఎక్కే ఆచారం ఉంది. దీనివల్ల పరీక్షల్లో రాణిస్తామని నమ్ముతారు. పైన పేర్కొన్నవన్నీ మూఢాచారాలు లేదా మూఢ నమ్మకాలే అయినప్పటికీ ప్రజల్లో ఉన్న ఉత్సకత రీత్యా ఇప్పటికీ పాటిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News