Safe driving : మంచు కురుస్తున్నప్పుడు జర్నీ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
Safe driving : మంచు కురుస్తున్నప్పుడు జర్నీ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం.. ఉదయంపూట బయటి పరిసరాలన్నీ మంచు దుప్పటి కప్పేసినట్లుగా ఉంటాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంటుంది. దీనివల్ల నడుచుకుంటూ వెళ్లే వారికైనా, కార్లు, టూవీలర్లు, ఇతర వాహనాలను నడుపుతున్న వారికైనా ఇబ్బందిగా ఉంటుంది. దూరపు ప్రాంతాలు సరిగ్గా కనబడవు. దీని కారణంగానే తరచూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డ్రైవింగ్ చేసేవారు, ముఖ్యంగా మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ట్రిప్‌కు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
* మంచు కురుస్తున్నప్పుడు రోడ్లపై కార్లలో లేదా ఇతర వాహనాల్లో వెళ్లేవారు ఓవర్ స్పీడ్‌గా అస్సలు వెళ్ల కూడదు. లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయడం మంచిది. అలాగే సడెన్ బ్రేక్ వేయడంవల్ల వాహనం స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రన్నింగ్‌లో ఉన్నప్పుడు బ్రేకులను గట్టిగా నొక్కడం మరింత ప్రమాదకరం. ఇలా చేస్తే టైర్ లాక్ అయ్యి, రోడ్డుపై మంచు కారణంగా ఉన్న తడివల్ల టైర్లు జారి వాహనం కిందపడే అవకాశం ఉటుంది. కాబట్టి బ్రేకులు జాగ్రత్తగా యూజ్ చేయాలి. సడెన్‌గా కాకుండా సున్నితంగా వేయాలి. తక్కువ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది.
* రోడ్లపై వెళ్తున్నప్పుడు మంచు కురుస్తుంటే గనుక వెహికల్ స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి సందర్భాన్ని బట్టి ఇంజిన్ బ్రేకింగ్ కూడా ఉపయోగించాలంటున్నారు నిపుణులు. అలాగే ఓకేసారి ఎక్కువ గేర్‌లో, టాప్‌గేర్‌లో వాహనాన్ని నడపవద్దు. దీనివల్ల కంట్రోల్ తప్పి ప్రమాదాలు జరగవచ్చు. ఏదైనా ఆటంకం ఏర్పడినప్పుడు సడెన్ బ్రేక్ వేసినా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. తక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఇలాంటి ప్రదాల నుంచి బయటపడవచ్చు. ఇక మంచు ఎక్కువగా కురిసే టూరిస్టు ప్లేస్‌లకు ట్రిప్‌కు వెళ్తుంటే గనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై టైర్లు స్లిప్ కాకుండా సురక్షితమైన టైర్లను వాడాలి. అలాగే హిల్ స్టేషన్స్, ఎక్కువగా మంచు కురిసే ప్రాంతాల్లోకి వాహనాలపై వెళ్లేవారు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన ఉంటేనే వాహనం నడపడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.