ఈ టాటూతో గుండె సమస్యలు దూరం
గుండె పంపింగ్ సరిచేసేందుకు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్: గుండె పంపింగ్ సరిచేసేందుకు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం గ్రాఫేన్ టాటూను డెవలప్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు. హార్ట్ రిథమ్‌ను కంట్రోల్‌లో ఉంచేందుకు ఇప్పటికే అభివృద్ధి చేసిన పేస్‌మేకర్ కొన్ని సందర్భాల్లో విఫలం అవుతుండటంతో .. దీని అప్‌గ్రేడ్ వెర్షన్‌గా తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సహాయంతో గుండె సాధారణంగా పంపింగ్ చేసేలా రూపొందించారు. ఇప్పటికే ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ ఎలక్ట్రానిక్ టాటూ సక్సెస్ కాగా.. మానవుల హృదయాల్లో త్వరలోనే అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇక ఈ పరికరం కోసం గ్రాఫేన్ ఉపయోగించిన పరిశోధకులు.. సజీవ ఎలుకల్లో పరీక్షించారు. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సెండ్ చేయడం ద్వారా హృదయ స్పందనను కరెక్ట్ చేస్తుందని కనుగొన్నారు. సిలికాన్, సూపర్ థిన్ పాలిమర్ షీట్‌ల మధ్య ప్లేస్ చేయబడే గ్రాఫేన్ ట్రాన్స్‌పరెంట్ లేయర్.. విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించడానికి విద్యుత్ మూలానికి కనెక్ట్ చేసిన వైర్‌లకు బంగారు టేప్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. అయితే ఎలక్ట్రికల్ సిగ్నల్‌లను ఎంచుకోవడానికి చిన్న యాంటెన్నాను ఉపయోగించడం ద్వారా .. భవిష్యత్తులో ఈ టాటూను వైర్‌లెస్‌గా మార్చవచ్చని అంటున్నారు సైంటిస్టులు. అంతా కరెక్ట్‌గా జరిగితే బియ్యం పరిమాణంలోని గ్రాఫేన్ ఎలక్ట్రోడ్‌లను గుండె కండరాల్లోకి ఇంజెక్ట్ చేయవచ్చని, తద్వారా అది పేస్‌మేకర్‌గా పనిచేస్తుందని ఆశిస్తున్నారు..
Also Read..
Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకవుతుందో తెలుసా?