ఇక శనిగ్రహంపైనా జీవించవచ్చు.. ఎలా సాధ్యమో తెలుసా?

సౌర వ్యవస్థలో అనేక అద్భుతాలు, సైంటిస్టుల ఆవిష్కరణలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా శని గ్రహంపై గల ఆరవ అతి పెద్ద చంద్రుడైనటువంటి ఎన్సెలాడస్‌పై పరిశోధనలు కూడా అటువంటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Update: 2023-06-15 06:01 GMT

దిశ, ఫీచర్స్ : సౌర వ్యవస్థలో అనేక అద్భుతాలు, సైంటిస్టుల ఆవిష్కరణలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా శని గ్రహంపై గల ఆరవ అతి పెద్ద చంద్రుడైనటువంటి ఎన్సెలాడస్‌పై పరిశోధనలు కూడా అటువంటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఫ్రెష్ అండ్ క్లీన్ ఐస్‌తో కప్పబడి ఉండే ఈ చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రతిబింబిస్తుంటాడని, అక్కడ మానవ జీవితానికి అవసరమైన వాతావారణం ఉందని జర్మనీలోని బెర్లిన్‌లో యూనివర్సిటీకి చెందిన ప్లానెటరీ సైంటిస్టు ఫ్రాంక్ పోస్ట్‌బర్గ్ నేతృత్వంలోని సైంటిస్టులు కనుగొన్నారు. జీవించడానికి దోహదం చేసే భాస్వరం (phosphorus) శనిగ్రహంలోని చంద్రుడిగా పేర్కొనే ఎన్సెలాడస్‌ ఉపరితలంపై మంచుకింద గల సముద్రంలో విరివిగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

పరిశోధనలో భాగంగా సైంటిస్టులు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)కు చెందిన కాస్సిని మిషన్ ద్వారా సేకరించిన డేటాను కూడా విశ్లేషించారు. ఈ మిషన్ 2004లో శని గ్రహం, దాని వలయాలు, చంద్రులను అన్వేషించడం ప్రారంభించింది. 2017లో దీని సమయం ముగిసినప్పుడు అది ప్లానెట్ అట్మాస్పియర్‌లో బర్న్ అయిపోయింది. కాగా ఎన్సెలాడస్ నుంచి అంతరిక్షంలోకి విడుదల చేయబడిన ఉప్పు అధికంగా ఉండే మంచుపొరలలో భాస్వరం లాక్ చేయబడినట్లు కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు జూన్ 14న ది జర్నల్ నేచర్‌లో పబ్లిష్ అయ్యాయి. కాస్సిని ప్లూమ్ అండ్ ఇ- రింగ్ గుండా అనేక సార్లు ఎగిరిందని, దీనివల్ల ఎన్సెలాడస్ మంచులో ఖనిజాలు, జీవసంబంధమైన సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నట్లు నాసా తెలిపింది. అయితే ఇది ఖగోళ జీవశాస్త్రానికి అద్భుతమైన ఆవిష్కరణగా నిలుస్తుందని సౌత్‌వెస్ట్ ఇన్ స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫర్ గ్లీన్ పేర్కొన్నాడు. శనిగ్రహంపై ఎన్సెలాడస్ అనే మూన్‌లో భాస్వరం విరివిగా ఉంది. నిజానికి ఇది డీఎన్‌ఏ నిర్మాణంలో ఒక బిల్డింగ్ బ్లాక్‌గా ఉపయోగపడుతుంది. క్రోమోజోమ్‌లను ఏర్పరుస్తుంది. క్షీరదాలలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్‌‌కు దోహదం చేస్తుంది. అంతేగాక భూమిపై ఉన్న అన్ని జీవులలో ఉన్న శక్తిని మోసే అణువులలో భాస్వరం చాలా ముఖ్యమైనది. శనిగ్రహంపై దీనిని కనుగొన్నందున భవిష్యత్తులో అక్కడ మానవ జీవితం సాధ్యమవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు.

Also Read:   కుక్కలతో ఆ పని ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! 

కలయిక లేకుండానే బిడ్డను కనొచ్చు.. అదెలాగంటే ! 

Tags:    

Similar News