ఈ యోగాసనాలతో మీ బాడీని ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోండి..!

ప్రతీ రోజు వ్యాయమం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Update: 2024-11-13 09:01 GMT

దిశ, ఫీచర్స్: ప్రతీ రోజు వ్యాయమం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని సమస్యలను తగ్గించడానికి యోగా ఉపయోగపడుతుంది. మానసికంగా, శారీరకంగా ఇది మనిషిని స్ట్రాంగ్‌గా ఉంచుతుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతీ రోజు వ్యాయమం, ప్రాణాయామం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వవు. అయితే, ఇందులో చాలా రకాల యోగాసనాలు ఉన్నారు. ఒక్కో వ్యాయామం ఒక్కో ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. ప్రతీ రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. శరీరం, మనస్సు కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలతో బాధ పడేవారు తరుచుగా యోగా చేయడం మంచిది. శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచేందుకు సహాయపడే కొన్ని యోగాసనాలను తెలుసుకోండి.

త్రికోణాసన్:

త్రికోణాసన్ అనేది వెన్నెముక ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం వేసేటప్పుడు ఛాతి ప్రాంతం విస్తరిస్తుంది. ముందుగా నిటారుగా నిలబడి రెండు కాళ్లను వీలైనంతగా పక్కకు పెట్టాలి. ఇప్పుడు చేతులను భుజాలతో సమానంగా పక్కవైపుకు పెట్టాలి. ఇప్పుడు నివాదనంగా వంగి కుడిచేతితో కుడి కాలివేలును తాకాలి. తరువాత ఎడవ చేయి, ఎడమ కాలుతో చేయాలి. ఇలా చేయడం వల్ల

శ్వాస ఈజీగా అందుతుంది. దీని వల్ల పొత్తి కడుపులో ఒత్తిడి తగ్గి, తుంటి వెన్నునొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఆస్తమా, గురక వంటి శ్వాస సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉత్తానాసనం:

ఉత్తనాసనం వేయండం కోసం ముందుగా నిటారుగా నిలుచుని చేతులు పైకి లేపాలి. తరువాత నెమ్మదిగా కిందకి వంగుతూ చేతులను పాదాలు లేదా నేలను తాకేలా చూసుకోవాలి. ఇప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మోకాళ్లు, వెన్నునొప్పి సమస్యలు ఉన్న వారు ఈ ఆసనం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బటర్ ఫ్లై ఆసన్:

ఇది మహిళలకు బెస్ట్ ఆసనమని చెప్పొచ్చు. ఈ ఆసనం వేస్తే గర్భిణీలకు ప్రసవం సులభంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బటర్ ఫ్లై ఆసనంతో లోయర్ హిప్, బ్యాక్స్, కండరాలను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మ్యాట్‌పై ప్రశాంతంగా కూర్చొని, రెండు కాళ్లను మోకాళ్ల వరకు తీసుకురావాలి. ఆ తర్వాత రెండు పాదాలను ఒక దగ్గరకు చేర్చాలి. అరికాళ్లను రెండు చేతులతో పట్టుకుని, సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లు చేయాలి.

సేతుబంధాసన్:

ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను మడిచి, చేతులతో వీపు కింద భాగం నుంచి కాలి మడిమలను పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తుంది.

అధోముఖ శ్వానాసన్:

ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి మంచి రిలీఫ్ ఇస్తుంది. అయితే, హై బ్లెడ్ ప్రెషర్ ఉన్న వారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Tags:    

Similar News