Sanitary Pads: ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్స్.. ఎక్కడ అంటే?
పీరియడ్స్ అనేది చాలా కామన్. ప్రతి నెల జరిగే సహజమైన ప్రక్రియ. ఇక చాలా మంది మహిళలు ప్యాడ్స్ వాడుతుంటారు. ఈ రోజుల్లో వీటి ధరలు కూడా మండిపోతున్నాయి. కానీ తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరూ
దిశ, ఫీచర్స్ : పీరియడ్స్ అనేది చాలా కామన్. ప్రతి నెల జరిగే సహజమైన ప్రక్రియ. ఇక చాలా మంది మహిళలు ప్యాడ్స్ వాడుతుంటారు. ఈ రోజుల్లో వీటి ధరలు కూడా మండిపోతున్నాయి. కానీ తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. జన ఔషధి కేంద్రాల్లో శానిటరీ ప్యాడ్స్, న్యాప్ కిన్లు కేవలం ఒక రూపాయికి మాత్రమే అమ్ముతున్నారు.
ఈ షాపుల్లో నాలుగు, 10 ప్యాడ్స్ ఉండే ప్యాకెట్లు ఉంటాయి. బయట దొరికే ప్యాడ్స్ కంటే ఇవి చాలా తక్కువ ధర, దాదాపు 75 శాతం తక్కువకు ఇక్కడ లభిస్తాయి. ప్యాడ్సే కాకుండా డైపర్స్ ,మాస్క్‌లు వంటివి కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలా తక్కువ ధరకు అమ్మకాలు జరిపే ఈ కేంద్రాలు ఎక్కడివి, వీటి గురించిన సమాచారం గురించి చాలా మంది వెతుకుతుంటారు వారి కోసమే ఈ సమాచారం.
జన ఔషధి స్కీమ్ 2008లో ప్రభుత్వం తీసుకురాగా, 2016లో దీనిని భారతీయ జన్ ఔషధి పరియోజన అని ప్రధానమంత్రి పేరు మార్చారు. ఇవి రోడ్డు పక్కన చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి. బయట షాపుల్లో దొరికే మందులకన్నా ఇవి ఈ కేంద్రాల్లో చాలా తక్కువ ధరకు లభిస్తుంటాయి. దాదాపు 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి నిపుణుల పర్యవేక్షణలో తయారు చేస్తారు. ఇంకా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వం ఓ యాప్‌ను కూడా తీసుకచచింది. దాని పేరు JAN AUSHADHI SUGAM.. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మందుల ధరలు, అందుబాటులో తెలుసుకోవచ్చు, మీకు నచ్చినవి కొనుగోలు చేసుకోవచ్చు.