డేటింగ్ యాడ్ ఇచ్చిన ఇద్దరు పిల్లల తల్లి.. సరికొత్త ట్రెండ్

సాధారణంగా ఫారిన్ కంట్రీస్‌లో పార్ట్‌నర్‌ను వెతుక్కునేందుకు డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తారు.

Update: 2022-12-06 10:03 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఫారిన్ కంట్రీస్‌లో పార్ట్‌నర్‌ను వెతుక్కునేందుకు డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తారు. కానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి.. రష్యాలో 'టిండర్' వంటి యాప్స్ అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో భాగస్వామిని కనుగొనేందుకు ఓ మహిళ ఏకంగా పబ్లిక్‌గా యాడ్ ఇచ్చింది. నగరంలోని బిల్ బోర్డ్‌లు అన్నింటినీ అద్దెకు తీసుకుని.. 'నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని తన కారుపై రాసి పెద్ద పెద్ద బోర్డులను ఏర్పాటు చేయించింది. డేటింగ్ యాప్‌లతో భాగస్వామిని కనుగొనే అవకాశం లేకపోవడంతో ప్రకటనలను ఆశ్రయించింది రష్యన్ మిలియనీర్ మరియా మోలోనోవా. 26 సంవత్సరాల వయసున్న ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా.. తనకు ప్రేమను పంచే భాగస్వామి కావాలని ఉలాన్-ఉడే నగరంలో యాడ్స్ ఇచ్చింది.


ఇందుకోసం సాధారణంగా పలు బ్రాండ్‌లు, ఉత్పత్తుల కోసం ఉపయోగించే ప్రకటనల బిల్‌బోర్డ్‌లను అద్దెకు తీసుకుంది. వివాహం చేసుకోవాలనుకుంటున్న మరియా మోలోనోవా పర్ఫెక్ట్ హజ్బెండ్‌ను కనుగొనేందుకు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తాను అంటోంది. 'డేటింగ్ సైట్‌లలో వ్యక్తులను కనుగొనడం కష్టమైంది. అలాగని వెయిట్ చేయాలని లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని చెప్పింది. మోలోనోవా ప్రకటన ఇంటర్నెట్‌లో మరియు రష్యాలో గొప్ప ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆమె తన మ్యాచ్‌ను కనుగొనిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ఏ సమయంలోనైనా వెనక్కి తగ్గే ఆలోచనలో లేనందున.. తగిన అభ్యర్థిని కనుగొనే వరకు డేటింగ్ యాడ్ కొనసాగుతుంది.

READ MORE

మాస్ కాపీంగ్‌లో మరో లెవల్ చీటింగ్.. పెన్నులే కదా అని వదిలేస్తే.. (వీడియో) 

Tags:    

Similar News