మనుషుల మూత్రాన్ని మౌత్ వాష్ గా వినియోగించిన రోమన్స్
రోమన్లు ఆధునిక నాగరికతకు దోహదపడ్డారని చరిత్ర చెప్తోంది.
దిశ, ఫీచర్స్: రోమన్లు ఆధునిక నాగరికతకు దోహదపడ్డారని చరిత్ర చెప్తోంది. రోడ్లు, సిమెంట్, తపాలా సేవలు.. ఇలా అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చిన రోమన్స్.. దంతాలను శుభ్రం చేసుకునేందుకు జంతువులు, మనుషుల మూత్రాన్ని వినియోగించేవారని అధ్యయనం వెల్లడించింది. అవును.. మన యూరిన్ లో ఉండే అమ్మోనియా(హైడ్రోజన్, నైట్రోజన్ సమ్మేళనం) మౌత్ వాష్ గా పనిచేసి.. దంతాలను తెల్లగా మారుస్తుందని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఇప్పటికీ గాజు, పింగాణీ, స్టెయిన్‌లెస్ స్టీల్ ను శుభ్రపరిచే పౌడర్స్ లో అమ్మోనియాను వినియోగిస్తున్నారు. అంతేకాదు అప్పట్లో లాండ్రీ లో బట్టల మురికిని తొలగించేందుకు యూరిన్ యూజ్ చేశారని.. దీంతో బట్టలు దుర్వాసన రావడంతో పన్ను విధించాల్సి వచ్చిందని తెలుస్తోంది.
మేకపాలతో మూత్రాన్ని కలిపి టూత్ పేస్ట్ తయారు చేసే రోమన్స్.. కుందేలు, గాడిద, ఎలుక సారాలతో ఎద్దు గిట్టల బూడిద, కాల్చిన గుడ్డు పెంకుల పొడిని కలిపి పళ్లు తోముకునే వారు. అందుకే అక్కడ ఎవరైనా తెల్లటి ముత్యాల్లాంటి పళ్లతో కనిపిస్తే అవమానాలు కూడా ఎక్కువగానే ఉండేవని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
Ancient Romans used urine as a form of toothpaste, mouthwash, and laundry detergent. pic.twitter.com/zguJbZ6eXy
— SERIOUSLY STRANGE (@SeriousStrange) May 14, 2015