ఉయ్యాల ఊగితే గిన్నీస్ రికార్డా.. ఆ ఊపుకున్న స్పెషలేంటో చూడండి!
అది అలా చేయడం అనుకున్నంత ఈజీ కాదు. Richard Scott spent 36 hours on a swing, break Guinness World Record.
దిశ, వెబ్‌డెస్క్ః ఏ పనైనా రికార్డెడ్ ఎవ్వరూ చేయనంత టైమ్‌లో చేస్తే దాన్ని రికార్డ్ అంటారు. అది ఉయ్యాలైనా, మరింకేదైనా..! అయితే, అలా చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఇంతే కదా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇక, ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ఈ రికార్డు కూడా అంతే కష్టతరమైంది. ఇది ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ స్కాట్ అనే వ్యక్తి చేసిన ఫీట్. 36 గంటల పాటు ఉయ్యాల్లో అటూ ఇటూ ఊగుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇందులో 36 గంటలు ఒక విశేషమైతే, కాలు నెలకు ఆనకుండా ఊగడం మరో ప్రత్యేకత. ఇక, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 51 ఏళ్ల రిచర్డ్ అనే వ్యక్తి లోచ్ లెవెన్స్ లార్డర్ క్రికెట్ పిచ్‌లో శుక్రవారం ఉదయం 6:10 గంటలకు ఊగడం ప్రారంభించి, ఆదివారం సాయంత్రానికి ముగించాడు. అయితే, ఉయ్యాలపై గడిపిన ప్రతి గంటకు ఐదు నిమిషాల విరామం ఇవ్వబడింది. రిచర్డ్ తన విరామ సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు నిద్రపోయాడు. ఈ రికార్డ్‌కు ముందు, ఇలాంటి మారథాన్ స్వింగ్, 2020లో క్విన్ లెవీ సాధించారు. క్విన్ 34 గంటల ఊగి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.