అంతరిక్షంలో రిజర్వాయర్.. భూమికంటే అక్కడ ఎక్కువ నీరు

అంతుపట్టని విషయాలు ఇంకా ఉన్నప్పటికీ.. అంతరిక్ష పరిశోధకులు ఇప్పటికే అనేక రహస్యాలను ఛేదించారు. ఇటీవల మరో కొత్త అంశంతో మన ముందుకు వచ్చారు. ఏంటంటే.. భూమికి సుదూర తీరంలో.. అంతరిక్షంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను ఉన్నట్లు అధునాతన సాంకేతి పరిజ్ఞానం ద్వారా గుర్తించారు.

Update: 2024-07-11 07:12 GMT

దిశ, ఫీచర్స్ : అంతుపట్టని విషయాలు ఇంకా ఉన్నప్పటికీ.. అంతరిక్ష పరిశోధకులు ఇప్పటికే అనేక రహస్యాలను ఛేదించారు. ఇటీవల మరో కొత్త అంశంతో మన ముందుకు వచ్చారు. ఏంటంటే.. భూమికి సుదూర తీరంలో.. అంతరిక్షంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను ఉన్నట్లు అధునాతన సాంకేతి పరిజ్ఞానం ద్వారా గుర్తించారు. పైగా అందులో ఈ భూమిపై ఉన్న సముద్రాల నీటి పరిమాణంకంటే కూడా దాదాపు 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువగా నీరు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ నీటి వనరుల రియల్ ఏజ్ సుమారు 12 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు.

పరిశోధకులు ఏం చేశారంటే..

నిజానికి స్పేస్‌లో నీటి జాడ కోసం వెతికే పరిశోధనలు 2008 నుంచి మరింత ఊపందుకున్నాయి. కాలిఫోర్నియాలోని పసాదేనాలోగల నాసా జెట్ ప్రొలప్షన్ లాబొరేటరీ సైంటిస్టు మాట్ బ్రాడ్‌ఫోర్డ్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా వారు హవాయిలోని మౌనాకీ శిఖరంవద్ద 33 అడుగుల టెలిస్కోప్‌ను యూజ్ చేస్తూ ప్రిలిమినరీ అబ్జర్వేషన్లను పరిశీలించారు. అట్లనే దక్షిణ కాలిఫోర్నియాలో గల ఇన్యో మౌంటెన్స్ వద్ద పారాబొలిక్ యాంటెనాలను కూడా ఫిక్స్ చేశారు. రేడియో టెలిస్కోప్‌లుగా పిలిచే ఈ అబ్జర్వేషన్ టెక్నాలజీ, యాంటెనాలు స్పేస్ నుంచి వచ్చే రేడియో తరంగాలను గుర్తించేలా సెట్ చేశారు. వీటి ఆధారంగా సైంటిస్టులు ఇటీవల అంతరిక్షం, గెలాక్సీలు, రేడియో ఫ్రీక్వెన్సీల రిలీజ్ వంటి అంశాలను స్టడీచేశారు. అలాగే టెక్‌లోని ఫిజిక్స్ పరిశోధకుడు డారియస్ లిస్ పర్యవేక్షణలో ఫ్రెంచ్ దేశంలోని ఓ పీఠభూమిలో డి బ్యూర్ ఇంటర్ ఫెరోమీటర్‌ను ఉపయోగిస్తూ, అంతరిక్షంలోని నీటి రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

కాస్వార్ వస్తున్న నీరు

రీసెర్చర్స్ ప్రకారం అంతరిక్షంలో నీరు ఒక క్వాసార్‌ చుట్టూ పేరుకుపోయింది. వాస్తవానికి కాస్వార్ అనేది బ్లాక్ హోల్‌లోని ఒక భాగంగా చెప్తుంటారు. ఇలాంటివి విశ్వంలో చాలా ఉండటంతోపాటు పెద్ద మొత్తంలో కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అందుకే ఇక్కడి వాతావరణం భిన్నమైందిగా ఉంటుంది. దీంతోపాటు నిరంతరం భారీ స్థాయిలో నీటిని ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం కనుగొన్న నీటి వనరు ఈ కాస్వార్ వల్ల ఏర్పడి ఉంటుందని చెప్తున్నారు. 


Similar News