ఆ టైమ్‌లో నిద్రలేచేవారే సంతోషంగా ఉంటారట.. ఎందుకో తెలుసా?
మీరు రోజంతా యాక్టివ్‌గా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేవడం అలవాటు చేసుకోండి.
దిశ, ఫీచర్స్: మీరు రోజంతా యాక్టివ్‌గా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా నిద్ర మేల్కొనేవారు తమ జీవితంలో అత్యంత ఆనందంగా, ఆత్మ విశ్వాసంగా, జీవితంపట్ల సంతృప్తిగా ఉంటున్నారని వార్సా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం వెల్లడిస్తోంది. ఉదయంపూట లేదా తెల్లవారు జామున మేల్కొంటున్న వ్యక్తుల్లో ఉన్నతమైన మనస్సాక్షి, ఆధ్యాత్మిక భావాలు ఉన్నవారు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని పరిశోధకులు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండటం, కష్టపడి పనిచేయడం లేదా శ్రద్ధగా ఉండటం అనే లక్షణాలు ఆధ్యాత్మికతలో ఇమిడి ఉండటమే ఇందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.
చాలామందిలో పొద్దున్నే (ప్రాత:కాలం) లేవడంతోపాటు తమ జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడం వెనుక ఆధ్యాత్మికత దోహదం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఉదయం వేళకు, మనస్సాక్షికి, ఆధ్యాత్మికతకు, జీవితంలో సంతృప్తికి మధ్య ఉన్న సంబంధాన్ని, పరస్పర చర్యలను బాగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా పరిశోధకులు పోలిష్ అడల్ట్స్ యొక్క రెండు సర్వే-ఆధారిత(survey-based) విశ్లేషణలను నిర్వహించారు. ఇందులో ఒక సర్వేలో 500 మందిపై స్టడీ నిర్వహించగా, రెండవ సర్వేలో 728 మందిని పరిశోధకులు సర్వే చేశారు.
ఈ రెండు సర్వేల్లోనూ ఉదయం పూట త్వరగా నిద్రమేల్కొనే(Early risers) ఆలోచన, వారి ప్రాధాన్యత, జీవితంలో సంతృప్తి, అలాగే మనస్సాక్షి స్థాయిని మూల్యాంకనం చేస్తూ ప్రశ్నాపత్రాలను పూర్తి చేశారు. ఒక సమూహాన్ని దేవునిపై వారి విశ్వాసం గురించి అడిగారు. మరొక సమూహాన్ని సాధారణంగా వారి మతతత్వం లేదా ఆధ్యాత్మికత గురించి అడిగారు. ఈ అధ్యయనాల ఫలితాలు ఉదయం పూట త్వరగా మేల్కొనే వ్యక్తుల్లో కొందరు ఉన్నతమైన మనస్సాక్షి గల వారైతే, ఎక్కువమంది ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు ఉంటున్నారు. ఇందులో ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు తెల్లవారు జామున లేదా సూర్యోదయానికి ముందు లేవడం దేవునిపట్ల కృతజ్ఞతగా భావించడంతో వారు తమ జీవితంలో అత్యంత సంతోషంగా, రోజంతా యాక్టివ్‌గా, సంతృప్తిగా, ఆత్మ విశ్వాసంగా ఉంటున్నారని పరిశోధకులు నిర్ధారించారు.
Read more :