Mint leaves for dark circles : కళ్లచుట్టూ డార్క్ సర్కిల్స్‌.. పుదీనా ఆకులతో ఇలా చేస్తే చాలు !

పుదీనా.. గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది వంటకాల్లో మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు.

Update: 2024-09-12 13:37 GMT

దిశ, ఫీచర్స్ : పుదీనా.. గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది వంటకాల్లో మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కళ్లచుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్‌ను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసం కొన్ని పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ డార్క్ సర్కిల్స్ ఉన్న భాగంలో అప్లై చేసి, చల్లటి నీటితో మొఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే కళ్లచుట్టూ నల్లటి వలయాలు మాయం అవుతాయి.

ఉరుకులు.. పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి.. ఇలా కారణాలేమైనా కళ్లచుట్టూ నల్లటి వలయాలు లేదా మచ్చలు వంటివి ఏర్పడే సమస్యలను పలువురు ఎదుర్కొంటున్నారు. అయితే వీటిని నివారించడంలో పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అందుకోసం ముందుగా పుదీనా ఆకకులను మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని పేస్ట్ లాగా మార్చి, ఆ తర్వాత కళ్ల కింద నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో క్రీమ్ లాగా అప్లయ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా కొంతకాలం చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. అలాగే పుదీనా ఆకుల నుంచి తీసిన రసాన్ని ఐస్ ట్రేలలో పోసి ఫ్రీజ్ చేయాలి. తర్వాత ఈ ఐస్ క్యూబ్స్‌తో కళ్లచుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్‌పై రాయాలి. కొంతకాలానికి అవి తగ్గిపోతాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంపై కూడా పుదీనా ఆకుల రసాన్ని అప్లయ్ చేస్తే స్కిన్ అలెర్జీలు రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News