'రిమోట్ కిస్'.. సుదూర ప్రాంతంలో ఉన్న వారితో రియల్ అనుభూతి
సుదూర ప్రాంతాల్లో ఉన్న తన భాగస్వామిని ముద్దు పెట్టకోవడమే కాకుండా..దాని రియల్ అనుభూతిని పొందేందుకు రిమోట్ కిస్ అనే పరికరం కనిపెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: సుదూర ప్రాంతాల్లో ఉన్న తన భాగస్వామిని ముద్దు పెట్టకోవడమే కాకుండా..దాని రియల్ అనుభూతిని పొందేందుకు రిమోట్ కిస్ అనే పరికరం కనిపెట్టారు. దీనిని చైనాలోని చాంగ్‌జౌలోని ఒక విశ్వవిద్యాలయం 'ముద్దు పరికరాన్ని' తయారు చేసింది. ఇది ప్రెజర్ సెన్సార్‌లతో కదిలే సిలికాన్ 'పెదవుల'ని కలిగి ఉంది. దీని ద్వారా ముద్దు పెట్టుకున్న జంట రియల్ కిస్ అనుభూతిని పొందవచ్చిని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దినిని సెల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చని దీనిని తయారు చేసిన చైనా విద్యార్థులు చెబుతున్నారు.