సమ్మర్‌లో ఏసీ ఆన్‌ చేసే ముందు ఈ విషయాలు తప్పనిసరి గుర్తుపెట్టుకోండి.. లేదంటే ప్రమాదంలో పడ్డట్లే!

చలికాలం వెళ్లిపోతుంది. ఎండాకాలం వస్తుంది. ఇక అందరి ఇళ్లలో జనాలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సిద్ధం చేసుకుంటారు.

Update: 2024-03-03 08:12 GMT

దిశ, ఫీచర్స్: చలికాలం వెళ్లిపోతుంది. ఎండాకాలం వస్తుంది. ఇక అందరి ఇళ్లలో జనాలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సిద్ధం చేసుకుంటారు. సాధార‌ణంగా చాలా మంది ఇళ్లలో ఎండాకాలంలో ఇన్ని రోజులు ఆఫ్ ఉన్న ఏసీ ఇప్పుడు ఆన్ అవుతాయి. చల్లటి ఏసీ గాలి వస్తుంటే హాయిగా అనిపిస్తుంది. ఇంటిలోనే కాదు.. ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ హబ్‌లలో ఏసీలను తప్పకుండా ఉండాల్సిందే.

ఒకసారి ఏసీకి అలవాటు పడితే.. బయటకు వచ్చిన‌ప్పుడు కొంతమంది ఏసీ బస్సో, లేదా ఏసీ క్యాబ్‌లో వెళ్లడం తప్ప నార్మల్ వెహికల్స్ లో ప్రయాణించేందుకు ఇష్టపడరు. అయితే ఏసీ చల్లదనాన్ని ఇచ్చినప్పటికీ దీంతో అనేక నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఏసీ వాడే ముందు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలంటున్నారు. లేదంటే ఏసీ కరాబ్ అయ్యే అవకాశాలున్నాయట. కాగా ఏసీ ఆన్ చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీలో అమర్చిన ‘ఫిల్టర్’ గాలిలోని దుమ్ము, ధూళిన చేరుకుంటుంది. కాగా సమ్మర్ లో ఏసీ ఆన్ చేసే ముందు ఫిల్లర్ ను ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. దీంతో ఏసీ కూలింగ్ సామర్థ్యం తగ్గదు. ఎక్కువ రోజుల పాటు వస్తుంది. తర్వాత అవుట్‌డోర్ యూనిట్‌ను కూడా క్లీన్ చేయాలి. స్ప్లిట్ ఏసీ అవుట్‌డోర్ యూనిట్ ఫ్యాన్, యూనిట్‌పై ధుమ్ము, ధూళి పేరుకుపోతుంది.

ఇది ఎప్పటికప్పుడు గమనించి.. శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఏసీ కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయదు. కాబట్టి దీనిపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. AC చాలా రోజులు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లైతే.. కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు దాని మోడ్ అండ్ ఉష్ణోగ్రత ఛేంజ్ అవ్వొచ్చు. ఫలితంగా ఏసీని మళ్లీ ఆన్ చేసిన తర్వాత మోడ్ అండ్ ఉష్ణోగ్రతను ఒకసారి చెక్ చేయండి. ఇంట్లో ఎలుకలు చాలాసార్లు ఏసీ వైర్లను కొరికేస్తుంటాయి.

దీంతో ఏసీ నడవదు. ఈ విషయాన్ని చాలా మంది గమనించరు. దీంతో ఏసీలో సమస్య వచ్చే చాన్స్ ఉంటుంది. కాగా స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు కనెక్ట్ చేసున్న కేబుల్ ను చెక్ చేయండి. అలాగే కండెన్సర్, ఆవిరిపోరేటర్ కాయిల్స్ చాలా నెలలు పనిచేయని తర్వాత మురికిగా పేరుకుపోతాయి. అలాంటి సందర్భాల్లో వేసవిలో మళ్లీ ఏసీ ఆన్ చేసే ముందు వాటిని క్లీన్ చేయడం మంచిది. ఏసీ వాడే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.


Similar News