ఆఫీసులో పై ఆఫీసర్‌తో రిలేషన్.. రొమాన్స్ మంచిదేనా?
ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో మొదలవుతుందో చెప్పలేం. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేమలో పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో కూడా ప్రేమలు మొదలవుతున్నాయి. సాధారణంగా
దిశ, ఫీచర్స్ : ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో మొదలవుతుందో చెప్పలేం. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేమలో పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో కూడా ప్రేమలు మొదలవుతున్నాయి. సాధారణంగా చాలా మంది ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువగా గడుపుతుంటారు.
దీని వలన సహ ఉద్యోగుల మధ్య మంచి సంబంధం ఉంటుంది. ఇది కాస్త చివరకు ప్రేమగా మారుతుంది. దీంతో చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫీసుల్లో సహా ఉద్యోగుల పట్ల, మన పైఆఫీసర్స్‌తో మంచి రిలేషన్ షిప్ ఉండటం మంచిదే కానీ అది ప్రేమగా మారితే ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. అలాంటి రిలేషన్ వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా ఆఫీసుల్లో ఒక బాస్ కి ఉద్యోగికి మధ్య ప్రేమ చిగురిస్తే, అది ఇద్దరికి తీవ్ర ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుందంట. ఎందుకంటే తాము ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి పట్ల వారు కాస్త సున్నితంగా వ్యవహరిస్తారు. మిగిలిన వారి పట్ల కఠినంగా ఉంటారు. ఇది ఆఫీస్ వాతావరణానికి ముప్పుగా మారుతుంది అంటున్నారు నిపుణులు.
ఇలా ఆఫీసులో తమకు నచ్చిన వ్యక్తి ఉండటంతో కాస్త రొమాంటిక్‌గా కనిపించడానికి, ఆ అమ్మాయి, లేదా అబ్బాయితో ఎక్కువసేపు మాట్లాడటానికి ఇష్టపడుతారంట. అంతే కాకుండా వారికి చాలా ఫేవర్‌గా ఉండటానికి, మనకు తెలియకుండానే మనకు నచ్చిన వారితో చాలా క్లోజ్‌గా ఉండటం చేస్తారు. ఇది ఆ ఆఫీసులో వర్క్‌కు ఎఫెక్ట్ చూపిస్తుందంట.మనకు అన్న పెట్టే కంపెనీకి ఎప్పుడూ విశ్వాసంగా వ్యవహరించాలి. ప్రేమ ఉన్నా.. పనిలో ఒకరికొకరు ప్రేమను చూపించకూడదంట. ఇ ప్రేమ మరియు ఆప్యాయతలను నియంత్రించడం ద్వారా ఉద్యోగులందరినీ సమానంగా చూడవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే ఆఫీసులో ప్రేమ వలన అది ఇద్దరికీ వ్యక్తిగతంగాను, వృత్తిపరంగా ఎఫెక్ట్ పడుతుదంట. ఆలోచిస్తే దీని వలన చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒక మంచి గౌరవం, ఉన్న వారిపై కూడా చెడు ప్రభావం పడి అది వారి వృత్తిపై ఎఫెక్ట్ చూపిస్తుందంట. కాబట్టి ఆఫీసుల్లో రిలేషన్స్ పై ఆలోచించి అడుగు వేయాలి అంటున్నారు నిపుణులు.