Belly fat: చున్నీ, స్కార్ఫ్ సాయంతో బెల్లీ ఫ్యాట్‌ను ఇలా తగ్గించుకోండి..!!

బరువు పెరగడానికి ముందే సూచించే లక్షణమే బెల్లీ ఫ్యాట్.

Update: 2024-10-05 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బరువు పెరగడానికి ముందే సూచించే లక్షణమే బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ శరీర ఆకృతిని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దీనితో పాటు ఎన్నో రకాల వ్యాధులను కూడా తెచ్చిపెడుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఈ కొవ్వు కారణంగా ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోవాలన్నా, నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. కాగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే కాస్త శ్రమ అవసరమే అంటున్నారు నిపుణులు. కాగా స్కార్ప్ లేదా చున్నీ సహాయంతో మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోండి. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

సిజర్స్ వ్యాయామం..

మ్యాట్ పై పడుకుని కాళ్లను చాపి రెండు అరికాళ్ల కింద చున్నీ లేదా స్కార్ప్ కట్టిండి. ఇప్పుడు ఆ చున్నీని రెండు చేతులతో పట్టుకుని పైకి కిందకు కదపండి. దీంతో చాలా సేపు వ్యాయామం చేస్తారు. దీన్నే సిజర్స్ వ్యాయామం అంటారు. ఎందుకంటే ఈ వ్యాయామంలో కత్తెరలాగా కాళ్లను పైకి, కిందకు అంటుంటాం కాబట్టి దీన్ని అలా పిలుస్తారు.

మోకాలి వ్యాయామం..

ముందుగా నిటారుగా నిల్చోండి. తర్వాత మోకాళ్లను మీ చెస్ట్ వద్దకు తీసుకురావడానికి చున్నీ ఉపయోగించండి. చున్నీని మోకాలి కింద నుంచి తీసుకోండి. తర్వాత చేతులతో దాన్ని మీ దగ్గరకు లాగండి. దీంతో కాళ్ల కదలిక ఈజీ అయిపోతుంది. 15 నిమిషాలు ఇలా ఈ వ్యాయామం చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ఐస్ లా కరిగిపోతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News