Prostate cancer: పురుషుల్లో ఆ లక్షణాలు దేనికి సంకేతం?.. గుర్తించగానే ఏం చేయాలంటే..

Update: 2024-08-19 07:44 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులకు అలసట సహజమైన లక్షణం.. పని ఒత్తిడి, అనారోగ్యాలవల్ల అప్పుడప్పుడూ ఇది వచ్చిపోతూ ఉంటుంది. కానీ దీర్ఘకాలంపాటు కొనసాగడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, శారీరక బలహీనత తరచుగా వేధించడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే కూడా ఈ సింప్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి కొందరిలో ఎటువంటి లక్షణాలు, సంకేతాలు కనిపించకుండా కూడా అది డెవలప్ అయ్యే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ఎదుర్కొంటుండగా.. యునైటెడ్ స్టేట్స్‌లో ఇది ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

క్యాన్సర్లలో అనేక రకాలు కాగా.. ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది స్పెర్మ్‌ను ప్రొడ్యూస్ చేసే చిన్న గ్రంథిలో సంభవిస్తుంది. ఈ క్యాన్సర్ బారిన పడితే వెంటనే చికిత్స అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తర్వాత ప్రాణాంతకం కావచ్చు. కాగా కొన్ని లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు. అవేంటో చూద్దాం.

* తీవ్రమైన అలసట, శారీరక బలహీనత : ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితుల్లో చాలా మందికి ముందస్తుగా లక్షణాలు కనిపంచే అవకాశాలు తక్కువ. అయినప్పటికీ గుర్తించదగిన కొన్ని సంకేతాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏంటంటే.. ఆ లక్షణాలన్నీ ఎక్కువగా మూత్రాశయ సంబంధిత సమస్యలతో ముడిపడి ఉంటాయి. అయినప్పటికీ తీవ్రమైన అలసట, శారీరక బలహీనత ఎక్కువకాలం కొనసాగడం ప్రొస్టేట్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* యూరిన్‌లో బ్లడ్ : కొందరికి మూత్రంతోపాటు రక్తం లేదా వీర్యం కూడా బయటకు వస్తుంది. కొన్నిరోజులు ఇది కనిపిస్తే గనుక అది ప్రొస్టేట్ క్యాన్సర్ అయి ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే కణితి మరింత పెద్దగా మారి సమస్యగా తీవ్రం అవుతుంది. రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు.

* అకస్మాత్తుగా బరువు తగ్గడం : సరైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ.. వారం పదిరోజుల్లో అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. కొందరు వెంటనే కాకపోయినా క్రమంగా బరువు కోల్పోతారు ఇవి కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితుల్లో సంభవించే లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వీటిని గుర్తిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను తప్పక సంప్రదించగలరు. 

Read more...

RSV సంక్రమణ అంటే ఏమిటి.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? 



Tags:    

Similar News