టిఫిన్ తిన్న వెంటనే టీ తాగుతున్నారా?
ప్రతి ఒక్కరు ఉదయాన్నే టీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తెల్లవారుజామున టీ తాగనిదే కొందరికి రోజే గడవ నట్లు ఉంటుంది. అయితే కొంత మంది పరగడుపున టీ తాగితే, మరికొందరు
దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరు ఉదయాన్నే టీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తెల్లవారుజామున టీ తాగనిదే కొందరికి రోజే గడవ నట్లు ఉంటుంది. అయితే కొంత మంది పరగడుపున టీ తాగితే, మరికొందరు టిఫిన్ తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు.
అయితే ఇలా టిఫిన్ తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వలన ఇది శరీర ఆహారం నుంచి అవసరమైన పోషకాలను గ్రహించడంలో ఆటకం కలిగిస్తుందంట. అంతే కాకుండా ఇది తీవ్రమైన ఐరన్ లోపానికి దారితీస్తుందంట. దీని వలన అనీమియా సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఉదయాన్నే తిన్న వెంటనే టీ తాగకూడదంట.
ఇంకొంత మంది ఉదయం, సాయంత్రం తిన్న తర్వాత టీ తాగుతారు. ముఖ్యంగా మహిళలు అతిగా టీ తాగుతుంటారు. అయితే ఇలా అతిగా టీ తాగడం వలన మహిళలు నెలసరిలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని, అందువలన టీ ఎక్కువ తాగకూడదని చెబుతున్నారు నిపుణులు.
Read More..